నేను పునర్జన్మను నమ్ముతాను
కర్మ సిధ్ధాంతం పాటిస్తాను
నా ధర్మం మంచిగా ఉండడం
అధర్మాన్ని వ్యతిరేకించడం
అంటే కామ క్రోధ లోభ
మద మోహ మాత్సర్యాలపై అదుపు
ధర్మంగా అర్థ కామాలను
మోక్షాన్ని సాధించడం.
నా దేవుడు తొమ్మిది సార్లు
తొమ్మిది రూపాల్లో వచ్చాడు
మంచిని రక్షించడానికి
చెడును శిక్షించడానికి
రామావతారం దాకా తనే చేశాడు
కృష్ణుడిగా ఇతరులతో చేయించాడు
కలియుగంలో ఎవరికివారే కల్కి
దుష్టత్వం నశింపజేయడానికి
శిష్ట రక్షణతో ధర్మం నిలపడానికి.
Also read: “శరణం గచ్ఛామి”
Also read: “యానం”
Also read: “ముక్తి”
Also read: “సమగ్రం”
Also read: “సంభవామి యుగే యుగే”