Sunday, November 24, 2024

సీమపై జగన్ ఫోకస్,అనంతపురం జిల్లా పై ప్రత్యేక దృష్టి

  • కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులతో 2024 జనవరి పెన్షన్ పంపిణీ
  • ఎమ్మెల్యే ల మార్పు, చేర్పులపై ఉత్కంఠ
  • ఎమ్మెల్యే లపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సమగ్ర  సమాచారం
  • రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు
  • ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల ఎంపిక

రాబోయే ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులతో   2024 జనవరి ఒకటిన పెన్షన్ పంపిణీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులు చేస్తున్న  నేపథ్యంలో  సీఎం జగన్ పై నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ టికెట్లు దక్కని వారు నియోజక వర్గాల్లో పర్యటించవద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసారు. అభ్యర్థుల ఎంపిక పై సీ ఎం జగన్ తీసుకునే నిర్ణయంపై తమ భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని ఆశావహులు చెప్పుతున్నారు.

Also read: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ దోబూచులాట!

రాయలసీమలో రాబోయే ఎన్నికల్లో  ముఠా, గ్రూపు రాజకీయలపై మళ్ళీ వైసీపీ పైచేయి సాధిస్తుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జసరుగుతోంది. జిల్లా పార్టీ నేతల నివేదికలను పరిశీలించిన  ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ పై ఫోకస్ పెట్టారని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కొన్ని వర్గాలు దూరం అవుతాయాని  జిల్లా ఇంచార్జిలు సీఎంకు నివేదించారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ముఠా, గ్రూపు రాజకీయ నేతలు గంప గుత్తగా వై సీపీకి మద్దత్తు పలికారు.  జగన్ అధికారం చేపట్టగానే పోలీస్ కేసులు ఎత్తిస్తారని ఆయా గ్రూప్ నేతలు భావించారు. ఐతే అనుకున్నది ఒకటి ఐనది ఒకటి అన్నట్లుగా జరిగింది. గ్రూప్ నేతలు ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన పోలీస్ కేసులు ఎత్తివేయలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ముఠా, గ్రూప్ నేతలు ఏ మేరకు వై సీ పీ కి మద్దత్తు పలుకుతారోనని రాజకీయ పరిశీలకులు  చర్చలు జరుపుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో రాబోయే  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సీపీ గెలుపు పై యువముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  తన పనితీరుపై  ఓటర్ల తీర్పు ఉంటుందని  భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికలకు 2024 జరగబోయే ఎన్నికలపై సమీక్షిoచుకోవడం పై సీ ఎం  జగన్ దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీ కేడర్ లో అసంతృప్తి  నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. గ్రామ స్థాయిలో  వాలంటరీ వ్యవస్థ తీసుకురావడంతో రాజకీయ ప్రభావం   తగ్గింది. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి లో  వై సీ పీ కేడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తన పట్ల కేడర్లో నెలకొన్న అసంతృప్తి పై సీ ఎం అరా తీస్తున్నట్లు తెల్సింది. కేడర్ తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి చెపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై సీఎం  దృష్టి పెట్టారు. గ్రామ స్థాయిలో  జరిగిన మార్పులపై సమగ్ర నివేదికను  తెపించుకుంటున్నట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ  వాలంటీర్లతో ప్రభుత్వం చేపట్టే పథకాలు అమలు కోసం మాత్రమే పని చేయించుకోవాలని కేడర్ కోరుతోంది. పార్టీ కేడర్ పని చేయాలంటే  నేరుగా  రాజకీయ లబ్ది  పొందాల్సి ఉంటుందని  పార్టీ సీనియర్లు  చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రానికి  తీసుకువచ్చేది కేడర్ అన్నది  సీఎం  గుర్తు  పెట్టుకోవాలని   స్థానిక నేతలు గుర్తుచేస్తున్నారు. 

Also read: ఏపీది దుందుడుకు చర్య: సాగునీటి  విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎమ్మెల్యేలు, కేడర్ తమ గోడు  చెప్పుకోవడానికి సీ ఎం  అవకాశం ఇవ్వకపోవడమే  ప్రస్తుత పరిస్థితి కి కారణం అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి  పరిస్థితి మెరుగు పడితే వై సీ పీ  విజయం తథ్యం మని కేడర్ ఢoకా  భుజాయిస్తోంది. ఎమ్మెల్యే లు తమ పని  మార్చుకోవాలని జగన్ పలుమార్లు సూచించారు. ఐనా కొంతమంది ఎమ్మెల్యే లు పని తీరు మారకపోవడం పట్ల సీఎం   అసంతృప్తి  వ్యకం చేసారు. పని చేయని ఎమ్మెల్యే లను  పక్కన పెట్టాలని సీ ఎం నిర్ణయం తీసుకున్నారు. 2019లో గెలిచిన 151 ఎమ్మెల్యే ల్లో దాదాపు 50శాతం ఎమ్మెల్యే లకు ఈ సారి టికెట్లు నిరాకరిస్తున్నట్లు  పార్టీ వర్గాలు చెబున్నాయి.  వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ లకు సిట్టింగ్ స్థానాలను  మార్చుతున్నట్లు  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం లో ఎవరెవరికి  మంచి పేరు వుందో  గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే బాధ్యతను  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి  అప్పగించినట్లు తెల్సింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు  అభ్యర్థులను  ఎంపిక చేసి పార్టీ అధిష్టానం కు పంపాలి.  ఎన్నికల్లో గెల్చే అభ్యర్థులు తమ ఆర్థిక, అంగబలంపై నివేదిక ఇవ్వనున్నారు. ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గం పై అభ్యర్థులను ఫిల్టర్  చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో  ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆశావహులు  సంఖ్య అధికంగా వుంది. వచ్చే ఎన్నికల్లో పొరుగు జిల్లాల్లో నుంచి  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దిగుమతి అవుతారని తెల్సింది.  ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాకు ఎంత మంది  అభ్యర్థులు పొరుగు జిల్లాల నుంచి  వస్తారోనని పార్టీ వర్గాలు సెటైర్లు వేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి జిల్లా వేరు పడింది.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజక వర్గాల్లో  ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గం లో టీడీపీ గెలిచింది. మిగతా 12 నియోజక వర్గాల్లో వైసిపి  విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో వై సీ పీ ఎన్ని స్థానాల్లో  గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఏదిఏ మైనా పార్టీ కేడర్ లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే దిద్దుబాటు  చర్యలపై సర్వత్రా  పార్టీ వర్గాలు వేచించుస్తున్నాయి.

Also read: ప్రజాస్వామ్య పునరుద్దరణే కాంగ్రెస్ లక్ష్యం : రేవంత్

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles