భగవద్గీత – 6
Emotional Intelligence
ఒక చెరువును ఊహించండి!
దానిలోనికి నాలుగు వైపులనుండి నీరు నింపే కాలవలు ఉన్నాయి అనుకోండి. ఆ నీరు నిరంతరం ప్రవహిస్తూ చెరువును నింపుతుంది. కొంత కాలానికి చెరువునిండి పోతుంది. చెరువు నిండినప్పటికీ కాలవల నుండి నీరు ప్రవహిస్తూనే ఉన్నదనుకోండి. కొంత సేపటికి చెరువు పొర్లి కట్టతెగి నీరు ఊరి మీద పడి ఊరును ముంచెత్తుతుంది!
Also read: విషయవాంఛల విషవలయం
చెరువు మన హృదయం అయితే కాలువ లోని నీరు మన భావావేశాలు. మన భావావేశాలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటే హృదయం తట్టుకోలేదు. బద్దలయి పోతుంది. బద్దలుకాకుడదు అనుకుంటే మన హృదయాన్ని విశాలం చేయాలి. ఎలా చేయాలి? అభ్యాస వైరాగ్యాల తోటి విశాలంచేయాలి.
ఎంత విశాలం చేయాలి? సముద్రమంత! ఎన్ని నదులనుండి నిరంతరం నీరు ప్రవహించి నింపివేసినప్పటికి సముద్రుడు చెలియలి కట్టదాటడు!
Also read: ఏది సత్యం, ఏదసత్యం? ఏది నిత్యం, ఏదనిత్యం?
అప్పుడు మన హృదయంలో (మనస్సులో) ఎన్ని భావాల వచ్చి చేరినప్పటికి అది పొంగదు. అప్పటి మన స్థితి…
॥ఆపూర్యమాణం అచల-ప్రతిష్ఠం సముద్రం ఆపః
॥ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాః
యం ప్రవిశంతి సర్వే సః॥
శాంతిం ఆప్నోతి న కామ-కామీ॥
“స్థితప్రజ్ఞత.” అలాంటి వాడే “స్థిత ప్రజ్ఞుడు”
Settled consciousness..
Also read: అంతా మనమంచికే…