Your children ………..by Khalil Gibran
స్వేఛ్ఛానువాదం : సి .బి. సి. మోహన్
నీ సంతానం
నిజంగా చూస్తే
నీ బిడ్డలు కారు .
ఒక జీవి జీవితేఛ్ఛకు
ప్రతీకలు మాత్రమే!!
వారి రాకకు నీవు వాహకానివి మాత్రమే
మూలానివి కావు!
జీవనం నీ తోటే గాని
వారు నీ అథీనులు కారు!!
నీ ఆశల మోసులతో
వారి భుజాలు కుంగదీయకు .
నీ ప్రేమానురాగాలు పుష్కలంగా ఇవ్వు
నీ ఆలోచనా లోచనాలు వారి కనవసరం
వారి భావథార వారిదే!!
నీ ఇంటిలో వారిని తల దాచుకోనివ్వు
వారి అంతః కరణలు స్వేఛ్ఛా విహంగాలే!!
నీ ఊహ కసాథ్యమైన సుదూర తీరాల్లో
వారి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయి!!
వారికి అనుకూలంగా
నీ జీవన విథానం మార్చుకో!!
వారిని నిన్ననుసరించమని చెప్పకు!
జీవితం ఎప్పుడూ వెనక్కు మళ్ళదు?!
భూత కాలం లో ఆడుకోదు .
నీవు నారి సారించిన ధనువు
నీ పిల్లలు సంధించిన బాణాలు
అద్రుశ్య విలుకాడు
అనంత మార్గం
లక్ష్యాన్ని గురి చూసి
కొట్టటానికి వీలుగా
నీ విల్లును తన శక్తితో
సవరిస్తాడు.
బాణాన్ని వింటిని కూడా
ఆ ధనుర్ధారి ప్రేమిస్తాడు
ఆ సవ్య సాచి చేతిలో
వంచబడడం కూడా
నీకు ఆనందదాయకమే !!
Who will guide our arrows and help us ?is he God or what? Poem is good