గ్రహణాల పట్లఉన్న అపోహలుతొలగించుకోండి.
గ్రహణాలను ఆహ్లాఆదకరంగా చూడవచ్చు.
గ్రహణాలపట్ల ప్రజల్లో చాలా అపోహలున్నాయి.
గ్రహణం సమయంలొ గర్భిణీ స్త్రీలు బజారులో తిరగరాదని, తిరిగితే పుట్టేపిల్లలు మొర్రితో పుడతారని , ఆ సమయంలో ఆహరం తీసుకోరాదని, నీళ్ళుకూడాతాగరాదని, పట్టుస్నానాలూ, విడుపుస్నానాలు అంటుకొంతమంది గ్రహణాపట్ల అవగాహన లేనివారు ప్రజలను భయపెడుతుంటారు.
అసమయంలో దేవుల్లగుళ్లనుకూడా మూసివేస్తారు.
అడుగడుగు దాన్నాలవాడు , ఆపదమొక్కులవాడు, పిలిస్తేపలికే తిరపతి వెంకంన్న గుడి కూడా మూసివేస్తారు.
ఇదంతానిజమేనా! చూద్దాం.
ఈనెల 25 సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
గ్రహణం అంటే చంద్రుడు, భూమి తమ చుట్టూ తాముతిరుగుతూ , సూర్యునిచుట్టు తిరిగేక్రమంలో ఒకదాని నీడ ఒకదానిమీద పడి గ్రహణం ఏర్పడుతుంది .
సూర్యుడికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినపుడు , సూర్యకాంతి చంద్రునిమీద పడి నందున చంద్రగ్రహణం ఏర్పడుతుంది .
అలాగే సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినపుడు , సూర్యకాంతి భూమిమీద పడక సూర్యగ్రహణం ఏర్పడుతుంది .
ఈవిషయాన్ని ఆదునిక విఙ్ఞానం ధ్రువపరుస్తుంది.
కానీ పుక్కిటి పురాణాలలో మాత్రం రాహువు కేతువు అనే రాక్షసులు సూర్యుణ్ణి , చంద్రుణ్ణి మింగుతారని , అందువలన గ్రహణాలు వస్తాయని పంచాంగకర్తలు చెప్పి , దానికి శాంతిపూజలు కుడా చేస్తారు.
అంతేకాదు గ్రహణం సమయంలొ ఫ్రిజ్ లలో ఉన్న పదార్ధాలు చెడిపోతాయని , దానికి విరుగుడుగా ఆవు పేడను ప్రిజ్ లకు పూస్తే లోపలి పదార్ధాలు చెడిపోకుండా ఉంటాయనికూడా ఈమద్య కొంతమంది ప్రచారం చేస్తూ, తమతెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకుంటున్నారు.
ఇదికేవలం మూఢ నమ్మకము మాత్రమే .
ఒకప్రక్క ప్రపంచమానవుఁడు ఇతర గ్రహాలలో కాపురం పెట్టేందుకు ఉరకలు వేస్తుంటే, మనం ఇంకా ప్రిజ్ లకు ఆవుపేడ పూస్తున్నామంటే, గ్రహణం సమయంలొ గర్భిణీలు తిరగరాదని , ఏమీ తినటం గాని, తాగటం గాని చెయ్యటం చెయ్యకూడదని, అసమయంలో సైన్స్ పంతుళ్లు సయితం దుప్పటి కప్పుకుని ముడుసుకొని పడుకుంటున్నాడంటే మనం సిగ్గుపడాలి.
మనం దుప్పటి కప్పుకొని పడుకోవటం కాదు. పాపం దేవుళ్లనుకూడా భయపెడుతూ తలుపులు మూసివెయ్యటం, వాళ్లకి ఎన్నోమహిమలూ ఉన్నాయని చెప్పుకోవటం ఎందుకూ?
మహిమలు మాదేవుళ్ళకు లేవని కనీసం చెప్పుకోండి.
గ్రహణాలసమయంలో చాలామంది హేతువాదుల కుటుంబాల లోని గర్భిణీ మహిళలు, తింటూ, తాగుతూ, ఎమీకాదని నిరూపించారు .అసమయంలో పుట్టిన పిల్లలు చందమామ లాగా ఉన్నందున వారికి చందమామ అనిపేర్లు పెట్టుకున్నారు. కనుక గ్రహణాలు పట్ల వున్న అపోహలు తొలగించుకొండి .
సైన్స్ తెలుసుకోండి.
నార్నెవెంకటసుబ్బయ్య