Thursday, December 26, 2024

నీవే

నీవే

నీవే నా ధ్యాస

నీవే నా ఆశ

నీ చూపే నా పులకింత

నీ తలపే వెన్నెల జల్లు

నీ వలపే అమృత పానం

నీ ఉనికే నా జీవిత ప్రేరణ

నీ మాటే నా సంగీతం

నీ నవ్వే నా సుమ జలపాతం

నీవే నా మనసున నిండిన సుధ

నీ స్నేహం నా జీవిత సాఫల్యం

నీ ప్రేమ నా జీవిత గమ్యం

నీ సహచర్యం నా స్వర్గం

నీ  పాట నా జీవన ప్రకంపనం

నీ రాక నా కలల స్వరూపం

నీ నిష్క్రమణ నా జీవిత తిమిరం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles