భగవద్గీత – 73
ఇన్ని వేల సంవత్సరాల మానవ మనుగడ తరువాత కూడా, ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తరువాత కూడా, మనిషి తన సంఘ జీవనానికి అవసరమైన రకరకాల రాజ్యాంగాలు రాసుకున్న తరువాత కూడా… మనిషిలో బాధ, కష్టం ఇంకా ఉన్నాయేమిటి? అసలు మనిషికి బాధలు ఎప్పటికీ ఉండవలసినదేనా?
Also read: రజోగుణము మోహావేశపరమైనది
ఇన్ని మతాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని ఆలోచనలు ఉన్నా బాధలింకా ఉన్నాయేమిటి?
మన భావావేశాలు మారవేమి? సంతోషం ఎప్పుడు సిద్ధిస్తుంది?
ఒక ఆండ్రాయిడ్ phone కొంటాము. దాని manufacturer ఎప్పటికప్పుడు దాని software update చేస్తుంటాడు. మన అవసరాలకు అనుగుణంగా దాని తయారీలో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తుంటాం.
అలాగే మనిషి కూడా బాహ్యమైన సౌకర్యాలను అభివృద్ధి చేసుకుని విలాసవంతమైన జీవనాన్ని సాగిస్తున్నాడు. కానీ వాడిలో pain-pleasure భావనలు, భావావేశాలు, కక్షలు, కార్పణ్యాలు, ఒకరికంటే మరొకరు అధికమనే భావనలు అలాగే ఉన్నాయి. వీటివలన కలిగే బాధలు పోయేటట్లుగా మనిషి మేధస్సులో ఏ update వ్రాయాలి?
Also read: స్వభావం ప్రధానం
ఆ update పేరే భగవద్గీత…
కష్టం వచ్చినప్పుడు అలాగే బాధపడుతున్నాడు, సుఖం కలిగినప్పుడు అలాగే పొంగిపోతున్నాడు. ఈ కష్టసుఖాలు అనే softwareను update చేసి వాటికి అతీతంగా మనిషి ఎదిగి జీవితంలో దుఃఖభావన లేకుండా ఉండేదెలా?
వీటికి కారణం మనిషిలోని సంకల్పాలే. మనిషి మనస్సుచేసే మాయాజాలమే. గృహాలు, వస్త్రాలు, ఆహారాలు, అలంకరణలు, వాహనాలు ఒకటేమిటి అన్నింటిలో అభివృద్ధి సాధించిన మనిషి తన అంతరంగంలో చెలరేగే పెనుతుఫానులు అరికట్టలేకపోతున్నాడేమిటి?
అసలు ఆ తుఫానులు ఎందుకు వస్తున్నాయి?
మనం అభివృద్ధి అని చెప్పుకునే ఈ భౌతికసంపదలు అవి పెరగాలనే సంకల్పాలు పెనువాయువులై మానససరోవరాన్ని అల్లకల్లోలం చేస్తుండటము వలన…
అందుకే మనస్సు శాంతించి నిజమైన సుఖం దొరకాలంటే మనిషి సంకల్పాలను వదిలివేసి సన్యసించాలి. యోగి కావాలి. అదే నిజమైన అభివృద్ధి.
Also read: పని నేర్చుకున్న తర్వాతనే పర్యవేక్షణ
యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ
న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన
అర్జునా… సన్యాసమని దేనిని చెప్పుదురో దానినే యోగమని తెలుసుకో. సంకల్పాలు వదిలిపెట్టని వాడెవ్వడూ యోగి కాజాలడు. మన కళ్ళముందర కాషాయం కట్టుకొని అనేక సంకల్పాలతో ఆధునిక హంగులతో తిరిగేవారిని ఏమని పిలుద్దాం?
Also read: ఎవరి మనస్సు శాంతితో నిండి ఉంటుంది?