Thursday, December 26, 2024

యోగి ఉత్తమోత్తముడు

భగవద్గీత – 30

Think of it, dream of it. Finally you will get it…. స్వామీ వివేకానంద యువతకు ఇచ్చిన సందేశమిది!

ఈ సందేశము దేని ఆధారముగా (ప్రాతిపదికగా) ఇవ్వబడింది అంటే భగవద్గీత అని సమాధానం వస్తుంది.

పైన చెప్పబడిన వాక్యాలు ధ్యానం దాని ఫలితాల గురించి.

ఒకడు సైంటిస్టు అవ్వాలనుకున్నాడు అనుకుందాము. అతను అనుక్షణం దాని గురించే ఆలోచిస్తుంటే చివరకు అది అయితీరుతాడు.

Also read: సంకల్పాలు పెంచుకోవాలా, తుంచుకోవాలా?

ఒకడు actor అవ్వాలనుకుంటాడు. దాని గురించే తపన పడుతూ ఉంటే అది అవుతాడు.

చాలా మంది… మనము ఫలానా కాలేకపోయామే అని మథన పడుతుంటారు.. అందుకు… అయినవాడికి అదృష్టం వుంది. తమను దురదృష్టం వెన్నాడుతుంది అని బాధపడతారు!

అయినవాడికి, కానివాడికి ఒకటే తేడా!

అయినవాడు ఆ పని గురించి ఆలోచించాడు. ఆ ఆలోచించటంకూడా ఎలా? తినడు, పడుకోడు, అతనికి వేరేవాటిమీద ధ్యాస ఉండదు. ఒకటే లక్ష్యం. తను ఏదయితే అనుకున్నాడో అదే. దానినిసాధించేదాకా వదలడు.

సాధించలేని వాడి ఆలోచన ఇలా ఉండదు. అది కోతిలాగ శాఖాచంక్రమణం చేస్తూ ఉంటుంది. అది బాగా చేయవచ్చా ఇది బాగా చేయవచ్చా, అవుతుందో లేదో… ఇలా నిరంతరం ఆలోచనలు మారుతూనే ఉంటాయి. It is a kind of psycho kinesis.

Also read: ఆహారవ్యవహారాదులలో సంయమనం

ధ్యేయ వస్తువు మీద, జ్ఞాన ప్రసారము ధ్యానం. మనం జీవితంలో ఏదయినా సాధించామంటే అది ధ్యానం వల్లే. డబ్బు,హోదా, బంగళా, కారు, నౌకర్లు ఇవన్నీ ధ్యానం వల్లనే.

ఇక్కడ మన ధ్యేయ వస్తువులు ఏమిటి ?

అన్నీ లౌకికమయినవి. వాటి మీద ధ్యానం చేస్తూ ఉంటే అవి సమకూరి మరల ఒకదాని తరువాత మరొకటి కొత్త ఆలోచనలు వస్తూనే వుంటాయి. లౌకిక సంకల్పాలు పుడుతూనే ఉంటాయి. అవి తీర్చుకోవడం కోసం మనిషి మల్లగుల్లాలు పడుతూనే ఉంటాడు.

యువకుల విషయానికి వస్తే Defining Career path and achieving goals అని రకరకాల మాటలు చెపుతూ ఉంటాము. (jargon) ఈ క్రమంలో మనిషి మీద ఒత్తిడి పెరిగి పోతుంది. వాస్తవానికి, భావనలకు మధ్య దూరం పెరిగినప్పుడు stress అధికమవుతుంది.

గణిత శాస్త్ర పరంగా

E-R=S

E=Expectation

R=Reality

S=Stress

అదే అలౌకిక విషయాల గురించి ఆలోచిస్తే…

అంటే Who am I ‘‘నేను’’ ఎవరు? అని ఆలోచిస్తే ఇక్కడ వాస్తవం, భావన ఒకటే అయిపోతాయి.

‘‘నేను’’ గురించిన వాస్తవం (మనకు తెలిసినది) నేను గురించిన భావం (మనం ఆలోచించేది) ఒకటే అవుతున్నది! అప్పుడు ఒత్తిడి, అదే stress… సున్నా అవుతుంది. అందుకే ధ్యానం వల్ల ఒత్తిడి మాయమవుతుంది అని చెపుతారు.

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యాస్చధికో యోగీ తస్మాత్‌ యోగీభవార్జునా!

ఏదయినా ఒకదానిని గురించి తపిస్తూ ఉండటమే తపస్సు చేయటం. అలాగే శాస్త్రజ్ఞాన సముపార్జన చేసేవాడికంటే, తపస్సు చేసే వానికంటే ధ్యానయోగి ఉత్తముడు.

 అందుకే నీవు యోగివి అయిపో అర్జునా అని చెపుతారు పరమాత్మ!

Also read: మనకు మనమే శత్రువు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles