- సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కుతున్న ఏపీ
- టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సజ్జల డిమాండ్
మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అని చంద్రబాబు విసిరిన సవాల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో రాజధాని రైతులకు పోటీగా మూడు రాజధానుల ఉద్యమం చేయించడం సరికాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ధైర్యం ఉంటే సీఎం జగన్ మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజలు మళ్లీ సీఎంగా జగన్ కావాలని కోరుకుంటే తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పకుంటానని చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు.
చంద్రబాబు కు ప్రతిసవాల్ విసిరిన పెద్దిరెడ్డి
చంద్రబాబు సవాల్ కు వైసీపీ నేతలు దీటుగా బదులిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసం చేస్తారా అని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిసవా ల్ విసిరారు. తిరుపతిలో టీడీపీది రెండో స్థానమో మూడో స్థానమో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో 51 శాతం మంది ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలిచారని ప్రజాస్వామ్యంలో ఇంతకంటే రెఫరెండం ఏముంటుందని పెద్దిరెడ్డి అన్నారు.
బాబు సవాల్ పై ట్విట్టర్ లో స్పందించిన సజ్జల
చంద్రబాబు సవాల్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు ఆయన మాటల మీద నమ్మకం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుందని అన్నారు. తాను నమ్మిన అంశాలపై నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు కాంగ్రెస్ వేరుపడ్డ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ లు ఏంచేశారో అందరికీ తెలుసని సజ్జల ట్విట్టర్ లో స్పందించారు.
ఇదీ చదవండి:సుప్రీంలో జగన్ సర్కార్ కు ఊరట