Saturday, December 21, 2024

తత్వ విచారణ – తర్క వివేచన

 (పాతికేళ్ళ వయసులో చేసిన పదో రచన)

“It has been the peculiar misfortune of India to be more by her superficialities than by her essentials. India is not a country of tigers and snakes alone. It is not all a country of saints and hermits. Nor is it ‘lion cloth’, ‘goats milk’, Tajmahal, Seville row, white residences if Simla are not the whole of India. India did not always pray and meditate. India has its teeming masses, its struggles, its history. Those who only know an ascetic India, do not understand India. Its masses struggled for life, groaning under the weight of oppression, rebelled, took to arms, were defeated and misled….”

– K. B. Krishna

 Studies in Hindu Materialism

సుమారు పదేళ్ళ కిందట ‘ప్రశ్న అధ్యయన వేదిక’, (పిఠాపురం) తరపున ప్రచురించిన అయిదు వ్యాసాల పుస్తకం, “తత్వ విచారణ – తర్క వివేచన (Philosophical Enquiry : Logical Wisdom). In the republic of mediocrity, genius is dangerous అనే ఇంగర్సోల్ వాక్యంతో మొదలైన ఈ పుస్తకం, the philosophical consequence of modern science is to abolish completely the distinction between science and philosophy అనే ముగింపు  వాక్యం తర్వాత ముగిసింది. ఆధునిక భారతీయ సాంస్కృతిక పునర్వికాస పితామహుడు మహాత్మా జోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులకు అంకితం ఇవ్వబడ్డ ఈ పుస్తకం, నా తాత్విక పరిణామానికి ఒక దిక్సూచి!

మొదటి వ్యాసం తత్వ విచారణ: తర్కవివేచన, ఇప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఏ పక్షానికీ చెందకుండా, ప్రజాపక్షంగా అక్షరాలని మల్చుకోవడంలో ఉన్న శక్తిని అనుభవించిన ఆ క్షణాలు ఈ నాటికీ నిశ్చయంగా నాలో ఉన్నాయి. రెండోది, ‘భౌతికవాదులున్నారు బహుపరాక్!” ప్రఖ్యాత కులనిర్మూలన వాదీ, మార్క్సిస్టు మేధావి, ప్రత్యామ్నాయ చరిత్రకారుడు, విస్మరిత సామాజిక యోధుడు కె. బి. కృష్ణ “Materialism is also the natural born son of India.” అనే మహత్తర వాక్యంతో మొదల వుతుంది. ఇప్పుడా ఇంగ్లీషు కొటేషన్లు కాస్త అతిగా అనిపిస్తున్నాయి కానీ, ఆ రోజుల్లో బహుశా మతానికి పాతరేయడానికి మనిషి పక్షాన గొంతెత్తడానికీ ఉన్న ఆవేశం అలాంటిది మరి!

ఇక మూడోది ‘హేతువాదం సిద్ధాంతం ఎందుకు కాదు ?” ఇదో ప్రత్యేకమైన వ్యాసం. ఈ వ్యాసం ‘హేతువాది’ పత్రికలో పునర్ముద్రించడం కోసం పెద్దలు, మిత్రులు ఈ మధ్యే గతించిన రావిపూడి వెంకటాద్రి గారు ఈ పుస్తకం చదివి ఫోన్ చేసి ప్రోత్సహిస్తూ మాట్లాడిన తీరు ఎప్పటికీ నేను మర్చి పోలేను. Still I like it. ఇక నాలుగో వ్యాసం “మతం – శాస్త్రం – సమాజం”కాగా, చివరిది ‘నెత్తురోడిన చైతన్యం నరేంద్రదభోల్కర్.’ మతోన్మాదం బలితీసుకున్న దభోల్కర్ స్మృతిలో రాసింది. పాతికేళ్ళ వయసులో ఇది రాసేనాటికి బహుశా బెట్రాండ్ రస్సెల్ తో కుస్తీ పడుతున్నా ననుకుంటా, మొత్తం ఆయన కోట్స్ నింపేసాను !

“మానవజన్మ తిని కూర్చో డానికి, భోగించి చచ్చిపోవడానికి కాక కొన్ని ఉత్తమాశయాల సంసిద్ధి కోసమను మాట నెవ్వరూ మరువ కూడదు. సాధారణ ఆహార నిద్రా భయ భోగాదులను జంతువులు కూడా అనుభవించి నీల్గుచున్నవి. వానికంటే మానవునిలో ఉన్న విశేషము జ్ఞానము. ఆ జ్ఞాన వాహినిని విజృంభిం చుటవకాశములు కల్పించకున్నచో మానవ జీవితమే వ్యర్ధము.” అన్న గరిమెళ్ళ సత్యనారాయణ గారి వాక్కులు అక్షరసత్యాలు. నాస్తిక, హేతువాద, భౌతికవాద సమాఖ్య సారధ్యంలో ప్రచురిం చిన దీనికి విరాళం,’ఇష్టమున్నంత, కష్టం కానంత, నష్టంలేనంత’ అని వేసాం, ఆ ప్రయోగాల మాటెలా ఉన్నా ఆనాటి నుండీ ఆ అస్తిరత్వం పోలేదు. అందుకే ఈ పుస్తకం గురించిన పరిచయం !

(ఆసక్తి ఉన్న మిత్రులు నా వాట్సప్ నంబర్ 9032094492 కి రిక్వెస్ట్ పెడితే సాఫ్ట్ కాపీ పంపగలను. ఆర్దిక సౌలభ్యం ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ప్రయ త్నాలకు సహకారం అందిస్తే సంతోషం. అన్నీకాదుకానీ అనేక అభిప్రాయాలు ఈరోజు ముచ్చట గొలుపుతున్నాయి. కాలక్షేపం కోసం కాకుండా సీరియస్ గా చదివేవారు మాత్రమే స్పందించమని మనవి.అనేక సంక్షోభాలు తలెత్తు తున్న క్రమంలో నూతన సమాజ నిర్మాణం కోసం వ్యక్తమైన ఈ అక్షరాల సాక్షిగా ఇన్నాళ్ళకిలా ఈ పొత్తం పై చిన్న రైటప్)

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles