–మంగారి రాజేందర్ జింబో
కొన్ని రాతలు
అవి
రచయితలవి కావొచ్చు
పత్రికా రచయితలవి కావొచ్చు
తిట్టినట్టుగానే ఉంటాయి
అందులో
తెలియని పొగడ్త ఉంటుంది
కొన్ని చూపులు అసహ్యించుకున్నట్టుగా ఉంటాయి
కానీ
ఆ చూపులు
నావైపు చూడు అన్నట్టు ఉంటాయి
ఏది అమ్ముడు బోయిన కలమో
ఏది అమ్మకానికి సిద్దంగా వున్న కలమో
అర్దమయ్యి, అర్దంకానట్టు
మరికొన్ని బహిరంగంగానే
బహిర్గతం అవుతాయి
మరికొన్ని మార్మికంగా వుంటాయి
బహిర్గతం ఒకటి
అంతర్గతం ఒకటి
చూసే కన్నుంటే
ఆ కోణాలన్నీ కనిపిస్తాయ్
అలాంటి కన్నొకటి
అలాంటి చూపొకటి
నా ప్రజలకు ప్రసాదించు
భగవాన్ !!
Also read: కనబడుట లేదు
Also read: నొప్పి మందు
Also read: ఒకప్పుడు …
Also read: నో …ఓపెన్ సెసేం
Also read: బ్రహ్మకమలం