————————-
( ‘ UPON THE SAND ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా.సి.బి.చంద్ర మోహన్
48. సంచారి తత్త్వాలు
———————
ఒక మనిషి రెండో మనిషితో ఇలా అన్నాడు.
” చాలా కాలం క్రితం సముద్రం పోటు మీద ఉన్నప్పుడు నేను ఒక పెద్ద కర్ర యెక్క మొనతో ఇసుక పైన ఒక పంక్తి వ్రాసాను. ప్రజలు దాన్ని చదవడానికి ఇంకా ఆగుతూనే ఉన్నారు. అది చెదిరి పోకుండా జాగ్రత్త తీసుకుంటారు.”
ఆ రెండో మనిషి ఇలా అన్నాడు.” నేను కూడా ఇసుక మీద ఒక పంక్తి రాసాను. అప్పుడు సముద్రం ఆటు మీదుంది. సముద్రపుటలలు నేను రాసిన దాన్ని చెరిపి వేసాయి. కానీ, నీవేమి వ్రాసావో నాకు చెబుతావా?”
మొదటి మనిషి ఇలా జవాబిచ్చాడు.” నేను ఇలా వ్రాసాను : ‘ నేను నేనే.’ నువ్వేమి వ్రాసావ్?”
రెండో మనిషి ఇలా అన్నాడు.” నేనిలా రాసాను:
‘ నేను ఈ మహా సాగరంలో ఒక నీటి బొట్టుని మాత్రమే.”
Also read: దేహము– ఆత్మ
Also read: మరణం
Also read: ఇద్దరు వేటగాళ్ళు
Also read: నది
Also read: ఆనందం