విద్యార్థులు అంటే విద్య అర్థించే వారు
చదువుల రూపమైన గురువును గౌరవించే వారు
ఏరీ, ఎక్కడ?
సగం మంది టీచర్లు లేని సర్కారు బడుల్లోనా
రుబ్బురోళ్లుగా మారిన ప్రైవేటు స్కూళ్లలోనా
ప్రభుత్వం ఇచ్చే ఫీజులతో కాలాక్షేపం చేసే కాలేజీల్లోనా
ప్రపంచంలోని మంచి విశ్వవిద్యాలయాల లిస్టులో
ఒకటి రెండు మాత్రమే కనిపించే మన యూనివర్సిటీల్లోనా
ఏరీ, ఎక్కడా కనిపించరేం?
లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, అబ్దుల్ కలాం లాంటి
అతికొద్దిమంది స్వయం ప్రకాశకులై
చదువే ధ్యేయంగా, పట్టుదలే మార్గంగా
ఒకరిద్దరు గురువుల సారధ్యంలో నడుస్తున్నారు
సమాజాన్ని, దేశాన్ని ప్రగతి పధాన నడిపిస్తున్నారు.
కంప్యూటర్ ఇంజనీర్లుగా, ఖగోళ, అణు శాస్త్రవేత్తలుగా
వ్యాపార దిగ్గజాలుగా ప్రపంచాన్ని ఏలుతున్నారు.
స్వార్థ పరులైన వ్యాపారులు
నీతిలేని రాజకీయ నాయకులు
అధికారంతో, అహంకారంతో
రిజర్వేషన్లు, ఉచిత పథకాలతో అడ్డుపడకపోతే చాలు
ఆ కొద్దిమంది (15%) నిజమైన విద్యార్థులే చాలు
మనందరి జీవితాలు బాగు పడడానికి.
(ప్రపంచ విద్యార్థుల రోజు అక్టోబర్ 15)
Also read: పేదరిక నిర్మూలన దినోత్సవం
Also read: “హంతకులు”
Also read: నా మాట
Also read: ‘‘అంతా మన మంచికేనా?’’
Also read: మహర్షి