Sunday, December 22, 2024

ప్రమాణాల పాటింపుపై దృషి పెట్టాలి

వస్తువులన్నింటికీ నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు ఉన్నా,  సర్వం నాసిరకం అవుతున్న నేటి పరిస్థితులలో ప్రభుత్వాలు ప్రతి వస్తువు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

ప్రపంచ లేదా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 9న నిర్వహించ బడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు తమతమ దేశాలలో ప్రమాణాలను నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపు కుంటారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎంఈ),  ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఈసీ), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ), ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయు), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ), ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ (ఐఈటీఎఫ్) వంటి ప్రమాణాల అభివృద్ధి సంస్థలలో  వినియోగ దారులు, నియంత్రకాలు, పరిశ్రమలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాణ్యతా ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం ఈ దిన ఉద్దేశ్యం.

వేలాది నిపుణుల కృషికి గుర్తింపు

వేలాది మంది నిపుణుల కృషిని గుర్తు చేస్తూ జరుపు కుంటారు. 1946, అక్టోబరు 14న లండన్‌లో జరిగిన సమావేశంలో 25 దేశాల ప్రతినిధులు పాల్గొని వినియోగ దారులకు ప్రామాణికమైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణిక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఒక సంవత్సరం తరువాత అంతర్జాతీయ ప్రమాణిక సంస్థ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంస్థలో 125 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశ్రమలు, వినియోగ దారులలో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని జాతీయ సంస్థలు వేరువేరు రోజుల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 2014లో యునైటెడ్ స్టేట్స్23 అక్టోబర్ 2014న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించింది.

కెనడా దేశపు జాతీయ అక్రెడిటేషన్ బాడీ అయిన స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (ఎస్.సి.సి) అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 12 అక్టోబర్ 2012న స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంది. 1947లో భారతదేశంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ చట్టాన్ని ఆమోదించి బ్యూరోను ఒక శాసన బద్దమైనా సంస్థగా మార్చారు. అప్పటి నుంచే ఐ.ఎస్‌ .ఐ ముద్ర ప్రకటితమైంది. ఈ ముద్ర గల వస్తువులు నాణ్యత కలిగినది.

జాతీయ పతాకం ప్రమాణాల నిర్ణయం

1947లో భారతీయ ప్రమాణాల సంస్థ మొదటి రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. ఒకటి బట్టలకు, రెండవది ఇంజనీరింగ్‌కు సబంధించినది. ఈ సంస్థ నిర్ణయించిన తొలి ప్రమాణం ఏమిటో తెలుసా? మన జాతీయ పతాకం ఎంత పొడవు, వెడల్పు ఉండాలన్నది ఈ సంస్థ నిర్ణయించింది. 1951లో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సంస్థ కార్యాలయంలో సలహా స్వీకరించారు. అంతే కాదు మెట్రిక్‌ విధానాన్ని దేశంలో 1955లో ప్రవేశ పెట్టారు. తర్వాత తూనికలు, కొలతల పరిమాణాన్ని చట్టాన్ని ఆమోదించింది. కాలక్రమంలో టెలి కమ్యూని కేషన్స్‌ టీకాలు, నూనె గింజలు, త్రాగునీరు, పాడి పరిశ్రమ వంటివి కూడా ఈ సంస్థ పరిధిలోకి చేర్చారు. ఐఎస్‌ఐ మార్కు సంస్థ అనుమతి లేనిదే ఎవరూ వాడకూడదు. అన్ని సాంకేతిక పరీక్షలు, తనిఖీలు నిర్వహించిన దరిమిలా ఒక సంవత్సరానికి ఐఎస్‌ఐ లైసెన్స్‌ ఇస్తుంది. ప్రతీ సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాలి.

ప్రమాణాలు నిర్ణయించడానికి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు ఈ రోజునే ప్రారంభించాయి.

(నవంబర్ 9, ప్రపంచ నాణ్యతా దినోత్సవం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles