శాంతం దైవ లక్షణం
క్రోధానికి ఆవలి వైపు
అరిషడ్వర్గాలకు కళ్ళెం.
శాంతం పిరికితనం కాదు
చేతగానితనం కాదు
ఆవేశ ఆక్రోశాలను
అదుపులో ఉంచిన లక్షణం
రాగ ద్వేషాల తక్కెడ
ఖాళీ అయితే
మిగిలే నిశ్చలత్వం శాంతి
జీవిత పరుగు పందెంలో
ఓడినా గెలిచినా
జీవన పోరాటం చివర
కోరుకునేది మనశ్శాంతి
సుఖ దుఖాలకు మధ్య బిందువు.
కోరికలు తగ్గితే మిగిలేది శాంతి.
నవరసాల్లో ఒకటి శాంతం
కావ్యాల్లో ముగింపు శాంత రసంతో
మంత్రాల్లో చివరిది శాంతి మంత్రం
ప్రపంచ శాంతికి మూలం
మన మనశ్శాంతి.
(సెప్టెంబర్ 21, ప్రపంచ శాంతిదినం సందర్భంగా)
Also read: “కర్మ భూమి”
Also read: మోహం
Also read: “తపన”
Also read: “యుగాది”
Also read: “మునక”