మనుషులం
మనసున్న వాళ్ళం
ఆలోచన చేయ గలిగిన వాళ్లం
అనుభవాల్లో అంతరాలు
అనుభూతుల్లో వైవిధ్యాలు
అభిప్రాయాల్లో భేదాలు
వ్యక్తిత్వాల్లో తేడాలు
సహజంగానే స్థిర పడతాయి.
మన జీవితంలో అనేక దశలు
బాల్య కౌమార యవ్వనాలు
బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాలు.
బిడ్డగా స్నేహితుడిగా విద్యార్థిగా
ఉద్యోగిగా భర్తగా తండ్రిగా తాతగా
అనేక పాత్రలు పోషిస్తాం.
నేను నిన్న చూసిన సత్యం
నేడు రూపం మార్చుకుంటూంది
నిన్నటి నా గురువు నేడు సహాధ్యాయి
నేటి నా సహాధ్యాయి రేపటి నా శిష్యుడు
సత్య శోధనలో సాధనలో
నిరంతరం అంతరాయం లేని అంతరాలే.
మారే మనిషికి ఎవరూ తోడు మిగలరు
ఎవరి దారి వారిదే
ఎవరి గమన వేగం వారిదే
నా అనుభవమే నిజం
నేను చెప్పిందే వేదం
ఎవరు నొచ్చుకున్నా ఇదే సత్యం
కాదంటే ఒప్పుకోను అనేది మూర్ఖత్వం.
ఈ ప్రపంచం ఒక నటనాలయం
ఎవరూ తన భావాన్ని
సహజ స్వభావాన్ని
బయట పెట్టకూడదు!
కుటుంబం సమాజం
నిర్దేశించిన పాత్రనే పోషించాలి
కాదంటే శిలువ నెక్కాలి
మొదటి రాయి ఆత్మీయులనుండే
అయినా ప్రపంచం గతి శీలమే
మనిషైనా లోకమైనా
గమనం ఆగితే మరణమే.
Also read: “నాన్న ప్రయాణం”
Also read: “కావాలి”
Also read: “శుద్ధి”
Also read: “ఓట్ల పండగ”
Also read: శ్రీ శ్రీ