Sunday, December 22, 2024

నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది

భగవద్గీత – 52

భాష తెలిసిన ప్రతివాడూ మాట్లాడటం వచ్చినవాడేనా?

‘‘మాట’’ అంటే నాలుగు పదాల కూర్పు మాత్రమేనా?

మనకు తెలిసిన నాలుగు పదాలు ఉచ్ఛరిస్తే కావలసిన ఫలితం వస్తుందా?

ఇది అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్న.

నన్ను ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు. ఇది మనమందరమూ తరచూ బాధపడే విషయమే.

‘‘నేను అన్నమాట ఒకటయితే వాళ్లు ఇంకొక రకంగా అర్ధంచేసుకున్నారు’’ ఇది మన అనుభవంలోని విషయం.

Also read: ప్రకటనల మాయాజాలం

అసలు అలా ఎందుకు జరుగుతుంది?

మాట అంటే?… భాష మరియు భావము – ఈ రెంటి కలయిక.

ఉదాహరణకు: ఒక తల్లి కొడుకుకు పొద్దున్నే బాగా జీడిపప్పువేసి అత్యంత రుచికరంగా ఉప్మా చేసిపెట్టింది. వాడు అటూ ఇటూ తిరిగి ఇంటికి వచ్చి ‘‘ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు’’ అని అడిగాడు. అదే సమయానికి మూడు రోజులనుండి తిండి దొరకని ఒక బిచ్చగాడు ఇంటి ముందు నిలబడి ‘‘ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు’’ అని అడుక్కుంటున్నాడు.

ఈ రెండూ ఒటేనా?

ఒకటే పదాలు. కానీ ఆ పదాలు ఏ భావంతో కూడుకొని మన చెవిని చేరుతున్నాయి. అంటే పదాలను ఏ భావంతో పొట్లం కడుతున్నాం?

శంకరాభరణం సినిమాలో ఒక డైలాగు ఉన్నది. ఆకలేసిన పిల్లడు ఒక రకంగా ‘‘అమ్మా‘ ‘అని అంటాడు. అదే నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు ఇంకొకరకంగా “అమ్మా” అని అంటాడు. భాష అదే. కానీ భావం వేరు.

Also read: ఆహార నియమాలూ, ఆరోగ్యం

గోద్రేజ్‌ కంపెనీ ఒక పరిశోధన చేసింది. అదేమిటంటే ఒకటే రకం సబ్బులు రెండు తీసుకొని ఒకదానిని మామూలు కాగితంతో చుట్టి అమ్మకానికి పెట్టారు. ఇంకొక దానిని ఆకర్షణీయంగా కనిపించే చక్కటి రంగు కాగితంలో చుట్టిపెట్టి observe చేశారు. అప్పుడు జనం ఎక్కువగా ఆకర్షణీయమైన pack లోదే ఎక్కువ కొన్నారు. మనస్సు అటు ఆకర్షింపబడుతుంది అన్నమాట.

ఆకర్షణీయంగా ఉంటే సరిపోతుందా? దానిలోని సరుకు కూడా నాణ్యమైనదై ఉండాలి. వ్యాపార పరిభాషలో చెప్పాలంటే మనిషి ఉత్పత్తి చేసే సరుకు ‘‘మాట’’. ఆ మాట ఎదుటివాడిని ఆకట్టుకొనేది అయివుండి, కావలసిన ఫలితాన్ని రాబట్టకలిగేది అయివుండాలి. ఇది ఒక తపస్సు.

దీనినే పరమాత్మ వాచిక తపస్సు అని అన్నారు.

అనుద్వేగకరమ్‌ వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌

స్వాధ్యాయాభ్యసనమం చైవ వ్మాయమ్‌ తప ఉచ్యతే

మనిషిలో ఉద్వేగము కలిగించనిది, ప్రియమైనది, హితమైనది, సత్యమైనది మాట్లాడటం, శాస్త్రాధ్యయనము ఇది వాక్కుకు సంబంధించిన తపస్సు అనబడుతుంది.

“నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.’’ అంతే కదా!

Also read: అసురీ ప్రవృత్తి అనంత రూపాలు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles