నేను మీతోనా అనుభవాలను పంచుకోవాలని చాల ఆశతో ఎదురు చూసాను. ఈరోజు నాజీవితంలో మరుపురాని రోజు. తెలుగులో ఒక పాటఉన్నది. ఆ పాట మీకందరికీ తెలుసు అనుకుంటాను “ఎన్నాళ్ళోవేచినఉదయం, ఈనాడే ఎదురౌతుంటే…’’ అలా ఉంది నాలోని ఫీలింగ్.
Also read: ప్రపంచ అద్భుత భర్తలు (World Wonderful Husbands)-6
జీవితం అంటే నాలుగు గోడల మధ్య ఉండటమేనా?
నేను నటరాజన్ ను 25 ఏళ్ళకిందట ప్రయాణంలో కలిసాను. నేను ఉద్యోగంచేస్తానని ఉద్యోగం వేటలో ఉన్నాను. మా మత ఆచారాల ప్రకారం ఆడపిల్లలు మదరసాలలోనే చదువుకోవాలి. కానీ కొన్ని కుటుంబాలు ఇదో నాలాగా ఇంగ్లీష్ చదువులు చదువుకోవచ్చు. విదేశాలకు వెళ్లి చదివాను. అక్కడే సెటిల్ అవుతే ఎలా ఉంటది అని ఆలోచించాను. నాలో ఏదో అసంతృప్తి, వెనక్కివచ్చేసాను. జీవితం అంటే నాలుగు గోడల మధ్య ఉండటమేనా ? అనిప్రశ్న. ఏదోసాధించాలని తాపత్రయం. అందుకే ఉద్యోగం వేట ప్రారంభించాను. ఇంట్లో గొడవలు. పెళ్లి చేసుకోని భర్తతో సుఖంగాఉండాలి, అదే జీవితం అన్నారు. చిన్నమ్మ దగ్గెర కొన్ని రోజులు ఉంటానని ఇంట్లో నుండి చిన్నమ్మ దగ్గెరకు వెళ్ళాను. అక్కడి నుండి ఉద్యోగ జీవితం మొదలు పెట్టాను. ఉద్యోగ ప్రయాణంలో నటరాజన్ కలిసాడు. మేము కలిసిన మూడవ రోజుఅనుకుంటాను ‘నన్నుపెళ్లిచేసుకుంటావా నటరాజన్ ‘ అనిఅడిగాను. నటరాజన్ షాక్ అయ్యాడు. తన గురించి ఏం తెలుసని అడిగారు. ఏంతెలియాలి, ఆడవాళ్లను గౌర విస్తారు, నాకుఅదిచాలు అన్నాను. ఇదిజరిగిన 5 వరోజు నాకు కావలసిన వస్తువులను తీసుకొని చిన్నమ్మ ఇంటిలో నుండి నటరాజన్ దగ్గెరకు వెళ్ళిపోయాను. నటరాజన్ స్నేహితులతో ఉండేవారు. నన్నుతీసుకవెళ్లి స్నేహితుల ఇంటిలో పెట్టారు. పెట్టారుఅంటే, అబద్ధంచెప్పినట్లుంది నాకు, దాచారు అనడం నిజ్జం. పెద్ద గొడవలు అయ్యాయి. నటరాజన్ ను పోలీసులు తీసుకవెళ్లారు. మా కుటుంబం వాళ్ళు నేను కనిపిస్తే చంపేస్తాం అని పోలీస్స్టేషన్లోనే అన్నారు. పోలీసులే వారి మాటలకూ భయపడ్డారు. మీలాంటి వాళ్ళందరూ మాకు సపోర్ట్ గా ఆనాడు వచ్చారు. పోలీస్ స్టేషన్ నుండి బయట పడ్డాము. కానీ మతం కాని వ్యక్తిని పెళ్లిచేసుకోవటం మా వాళ్లకు నచ్చలేదు, ఆ గొడవలు చాలా రోజులు నడిచాయి. ఆ ఊరు వదిలేసి ఇటు వచ్చాము. ఉద్యోగం వదిలేసాను. నటరాజన్ కు ఓ భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఇన్ని ఏళ్ళు ఉన్నాను. నటరాజన్ ఎప్పుడూ ఈ మాట చెప్పేవారు… ‘ప్రపంచం చాలా విశాలమైనది, అందులో మానవులు ఎలా జీవిస్తున్నారో చూడమని’….
Also read: ప్రపంచ అద్భుత భర్తలు(World Wonderful Husbands) -5
స్త్రీపురుషుల మధ్య ఇన్న ఘర్షణలు అవసరమా?
ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూసి అర్ధం చేసుకున్నది … నేను ఫిలాసఫీ చెప్పలేను. నాఫీలింగ్స్ మీతో పంచుకోవాలనేప్రయత్నం ..ఈసమాజంలో ఇన్ని కొట్లాటలు ఎందుకుఉన్నాయి? స్త్రీ – పురుషుల మధ్యన ఎందుకు ఇన్ని కాంఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆడవాళ్లను చంపేస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా రోజురోజుకు తయారు అవుతున్నాయి. స్త్రీ – పురుషులు కలిసిజీవించేటందుకు కులం – మతం అడ్డు తగులుతున్నాయి. ఈవిషయంలో 25 ఏళ్ళపరిస్థితులకు, నేటిపరిస్థితుల్లో ఏమాత్రం తగ్గుదల లేదు. విజ్ఞానం పెరిగింది. సెకన్స్ లో ఒకరి భావాలను ఒకరు పంచుకొనే విధంగా సాంకేతికరంగం పెరిగింది. మనం ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకునేది ఎక్కడో దూరంగా ఉండి కూడా వినే విధమైన సాంకేతికత వచ్చింది. కానీ మానవ సంబంధాలలోని ‘రిజిడ్ భావాలు అంటే అభివృద్ధి నిరోధకమైన భావాలలో’ కి ఈసాంకేతికతను ఎందుకు తేలేక పోయింది? ఎందుకు తేలేక పోతోంది? ఈ సాంకేతికతను మానవాళి బాగా వాడుకుంటుంది, కానీ మానసిక పరివర్తనను ఎందుకు తేలేకపోతుంది? ఎందుకు మనుషులలో ఉన్న అసమతుల్యతను మార్చలేకపోతుంది?
Also read: (World’s Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-4
ప్రజలను అభినందించాలి
ప్రజలను అభినందించాలి. ఎవరికి వారు గీతలు గీసుకొని ఎంతటి మూల్యం అయినా చెల్లించడానికి రెడీగా ఉంటున్నందుకు. ఒక దేశంపై మరోదేశం దాడులు చేస్తున్నారు. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు తలో దిక్కు పారిపోతున్నారు. ఆడవాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఆఫ్ఘానిస్తాన్ దేశం ఒక ఉదాహరణ. అభివృద్ధి చెందిన దేశాలలో స్త్రీల పరిస్థితి అంతంతనే. రెండవ తరగతి పౌరురాలిగానే స్త్రీలను చూస్తారు. దానికే అక్కడి స్త్రీలు సంతోషపడుతున్నారు. ఇక్కడ మనం వారిని ఉదాహరణగా చెప్పుకుంటున్నాము. నీ పని నీవు చూసుకుంటే ఎక్కడ ఏమీ అనరు. ఏ దేశంలోనైనా “వ్యవస్థను” ప్రశ్నించటం సహించరు. అన్ని దేశాలలో బీదరికం ఉన్నది. అన్ని దేశాలలో నేరాలు జరుగుతున్నాయి. అన్ని దేశాలలో వ్యభిచారం ఉన్నది. నటరాజన్ చెపుతూ వుంటారు “మానవహక్కుల” ఉల్లంఘన ఎక్కువగా జరుగుతున్నాయనీ, హక్కులను అణచివేస్తున్నారు అని. ఈ సమస్య ప్రపంచం మొత్తం ఉంది. ఒక దేశంపై ఇంకో దేశం చేస్తున్న దాడిలో మనుషులు జీవించే హక్కును పోగొట్టుకుంటున్నారు. కరోనా ఎంత భీభత్సం చేసింది. అకాల మరణాలు సంభవించాయి. ప్రతికుటుంబం నుండి ఒకరు అకాల మరణంకు గురైనారు. నాకు తెలిసిన కుటుంబాలే చాలా ఉన్నాయి. సమయానికి ప్రభుత్వాల స్పందన ఎంత? ప్రజల స్పందన ఎంత? ఇందులోకూడాకుల –మతాల భావజాలాలు. ఈ విషయాలు మానవ హక్కులను తుడిపినట్లు కాదా? మనుషులు మైండ్ సెట్ ను ఎలా తయారు చేసుకున్నారు అంటే .. ఒక అక్క ఉం. ఇద్దరు పిల్లలు. భర్త పెట్టే బాధను తట్టుకునే శక్తి ఆమెలో అయిపొయింది, విడాకులు తీసుకోకుండా ఆ బాధల భర్త నుండి దూరంగా వచ్చేసింది. పిల్లలతో ఉంటోంది. పెద్ద పిల్లోడు అనారోగ్యంకు గురైనాడు. చుట్టు పక్కల వారందరూ భయపడ్డారు. ఎవ్వరూ సహాయంకు రాలేదు. కానీ భర్తను వదిలిపెట్టి వచ్చింది, ఈమె చేస్తున్న రాచకార్యాలు ఏంటో ..అని ఇలాంటి మాటలే చాలా మాటలు అన్నారు. కొందరేమో భర్త చిరునామా చెపితే వెళ్లి తీసుకవస్తాము అన్నారు, సహాయం మాత్రం చేయరు. ఎవరో పోలీసులకు .. కరోనా వచ్చి నకొడుకును ఇంట్లో పెట్టుకొని చుట్టుపక్కల వారికి అంటిస్తున్నారు అని ఫిర్యాదుచేసారట. . ఆ గల్లీ మొత్తం ఒకటే హడావుడి. ఈ రకమైన ప్రవర్తన హక్కుల ఉల్లంఘన కిందకు రాదా? భర్త ప్రవర్తన, పొరుగు వారి ప్రవర్తన, పోలీసుల ప్రవర్తన ఏరకంగా చూడాలి?
Also read: (World’s Wonderful Husbands)ప్రపంచ అద్భుత భర్తలు-3
ఇది హక్కుల ఉల్లంఘన కాదా?
కులాంతర –మతాంతర వివాహాలు చేసుకోవద్దు అనటం హక్కుల ఉల్లంఘన కాదా? సామాన్య ప్రజలు రోజువారి ధరలను పెంచటం హక్కుల ఉల్లంఘన కిందకు రాదా? మహిళ – అంటే హిందూమహిళా, క్రిస్టియన్ మహిళా, సిక్కుమహిళా, ముస్లీమ్ మహిళా, జైన్ మహిళా అని చూపిస్తూ హిందూ రెడ్డి మహిళా, హిందూ కమ్మ మహిళా, హిందూ మాల దళిత మహిళా … క్రిస్టియన్ మాల దళిత మహిళా, క్రిస్టియన్ కాపు మహిళా … ముస్లీమ్ దళిత మహిళా ఇలా వింటున్నాము… నా కైతే ఎబ్బెట్టుగా అనిపించును. చాలఎక్కువ స్త్రీ –పురుషుల మధ్య అన్నిఅంశాలలోఅసమానత, వివక్ష, ద్వేషం, కక్ష, దోపిడి, హింసలు, అభివృద్ధి నిరోధకమైన ఆచార – వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు చదువులు చదువుతున్నారు, డబ్బును పెంచుకొనే విజ్ఞానమును పెంచుకుంటున్నారు, మరియు విషయం / సబ్జెక్టు మీద కన్నా వ్యక్తుల మధ్యన పోటీతత్వం పెంచుకుంటున్నారు. ఇది చివరికి ఒకే లింగం / సెక్స్ లమధ్య ప్రేమలు, వివాహాలకు దారి తీస్తున్నాయి. ఒకన్నా చెప్పాడు భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు పిల్లలపై తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, చివరికి ప్రకృతికి వ్యతిరేకంగా ఒకే లింగంల మధ్య ప్రేమలు ఏర్పడి పెళ్లిళ్లకు దా రిఅవుతున్నాయని. మతాంతర, కులాంతర వివాహాలపై జరుగుతున్న దాడులు కూడా అక్కడికే దారి తీస్తాయని, దీనికి గుర్తు దినదినం పెరుగుతున్న ‘సేమ్ సెక్స్ మేరేజెస్’ లు. ఇది మానవాళిని, ప్రకృతిని విధ్వంసపు చర్యలకు కవ్వింపు అనిపిస్తుంది. ఇలాంటి విషయాలపై, ప్రభుత్వాలుఎంతఅప్రమత్తంగా ఉంటాయో, వారికన్నా ఎక్కువగా పౌరులు అప్రమత్తం కావాలి. ప్రభుత్వాలుఎప్పుడైతే ‘మతం, కులం’ లతో రాజకీయ వ్యాపారం చేయటం మొదలు పెట్టారో, అప్పుడే ప్రభుత్వాల నైతికత బయటపడ్డది. నేను నమ్మే విషయం ‘స్త్రీ – పురుషుల’ మధ్య ఉన్న అసమానత గొడవలు తగ్గుముఖం పడితే ప్రజలు ఎదుర్కొంటున్నఅసమానతలు, దోపిడీ, హింసలు, అనైక్యత ఇవి సమసి పోవుటకు పెద్దగా సమయం పట్టదు. ఇదే విషయాన్ని నటరాజన్ తొ చాలాసందర్భాలలో చేసిన చర్చలో చెప్పేదానిని. నటరాజన్ అంటాడు ఈ పోరాట క్రమం, నిరంతరం ఉంటాది, ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది, అయితే అనిపించిన ప్రతీసారి మళ్ళీ మళ్ళీ శక్తిని కూడగట్టు కోవాలి, పోరాటంను మాత్రం ఆపకూడదు అని.
Also read: (World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2
ఆ అక్క ఉద్యమాలకు దూరమైంది ఎందుకు?
చివరగా ..ఉద్యమాలలో పని చేసే ఒక అక్క ఉంది. తల్లి తండ్రులు చూసిన పెళ్ళికొడుకును పెళ్లి చేసుకున్నది. కొన్ని రోజులలోనే ఉద్యమాలకు దూరమయ్యింది. మాఇంటికి వచ్చేది, ఇప్పుడు బందు అయ్యింది. విచారిస్తే భర్తవేధింపులు. ఇంతమందితో నీకు ఏం అవసరం, వీళ్ళుఎలాతెలుసు, వాళ్ళుఎలా తెలుసు అని అడుగుతాడట, కొడతాడట. ఓరోజు నన్ను కలిసేటందుకు బయలుదేరింది, ఎక్కడికివెళుతున్నావు అని అడిగారట, నిజంచెప్పింది. మాగురించి విచారించినాడట, మమ్మల్ని కలవవద్దు అని ఆర్డర్ ఇచ్చాడట. ఆ రోజు నుండి తాను ఆగిపోయింది. నాకు తెలియని ఇలాంటి అక్కలు ఇంకా చాలానే ఉండవచ్చు. నా అనుభవాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మీఅందరికీ ధన్యవాదాలు, మా జీవిత పోరాటంకు 25 ఏళ్లునిండింది. అందరికీ కృతజ్ఞతలు. అసలు నేను ఎవరో తెలియని వారే ఇక్కడ ఉండవచ్చు నా మాటలను ఓపికతో విన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా 25 ఏళ్ల వైవాహిక జీవితంలో నేను ఎన్నోమార్లు డిప్రెషన్ లోకి పోయాను. నటరాజన్, నా పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజు నుండి మీ అందరితో కలిసి నడవాలని అడుగు వేసాను. ఈఘనత నటరాజన్ దే. ఈ 25 ఏళ్ళ సుదీర్ఘ పయనంలో నేను ఎక్కడ అలసిపోతానో అనే అనుభూతి కలిగినప్పుడల్లా ప్రతీసారి నటరాజన్ రెండింతల సపోర్ట్ చాలానే ఇచ్చారు. నాలో ఇంత సంతోషానికి కారణం నటరాజన్ నా జీవిత సహచరుడు కావటమే. నా జీవితంలో ఇదొక అద్భుతం. సుమాలిని అక్క ఈ మధ్యనే పరిచయం. ఆమె ఒక మహాద్భుత స్త్రీ. మహీంద్రా ఇక్కడే పరిచయం. తాను ఏంచెపుతారో వినేటందుకు మీతో పాటు నేను కుతూహలంగా ఉన్నాను.
Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1