అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపు
- కెసిఆర్ కి రాఖీ కట్టడం
- పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం
- కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం
- 7 తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం
- 8 తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇలా చేయడం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్ పథకం అమలైందన్నారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస పార్టీ పిలుపునిచ్చింది.ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిచారు.ఈనెల 6,7,8 తేదీలో మహిళబందు కెసీఆర్ పేరిట సంబరాలు జరపాలని చేప్పారు. విద్యాశాఖ లోనూ అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టింది ప్రభుత్వం.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామమని కెటిఆర్ అన్నారు.
70 లక్షల హెల్త్ మరియు హైజనిక్ కిట్లను విద్యార్థులకు అందించామని,ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం తమదేన్ని అన్నారు.తమ ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నదన్నారు.వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందించడం.మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది చేప్పారు.