ఆమె…
పగుళ్లు వారిన నేలపై నెత్తిన నీటి కుండ తో
ఒంపులు తిరుగుతూ నడచి పోతున్న కాల నాగులా
జీవం పోసుకున్న అమ్మవారి నల్లరాతి మూలవిరాట్టులా…
ఆమె స్వేద బిందువులలో సేద దేరుతున్న
శతకోటి వేసవి సూర్యులను మోసుకెళుతూ…
ఆమె సినీ తార కాదు,
రత్నాభరణ భూషిత అయిన రాణి కాదు,
రాంప్ పై నడిచే ప్రపంచ సుందరి కాదు,
ఏ.సి. గదులలో కూర్చుని కుళ్ళిన ద్రాక్షరసం తాగి
రంగు మార్చుకున్న ఆధునిక రమణి కాదు
…ఒక సాధారణ పల్లెపడచు
ఎక్కడైనా చూడవచ్చు,
వరి పొలాలలో కోతలు కోస్తూ,
ఉప్పు కొటారుల లో ఉప్పు కుప్పలు వేస్తూ,
బంగారు గనులలో మట్టి లోడుతూ,
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఈ పవిత్ర భారత భూమిలో!
ఒక తెలుగింటి ఆడపడుచు, బెంగాలీ బహు,
తమిళ మరుమగల్…
నాకు తెలిసిన సూర్య చంద్రాగ్ని నేత్ర ఆమె,
నీనెఱిఁగిన ప్రకృతి, వికృతి, సర్వ భూత హిత ప్రద ఆమే,
దుర్గ ఆమే, కాళీ ఆమే…
నా తల్లి భారతి ఆమే!
Also read: మహా ప్రస్థానం
Also read: దాచుకున్న దుఃఖం
Also read: నమ్మకం
Also read: గొర్రె
Also read: యుద్ధము… శాంతి
Can I post part of this on my blog if I post a reference to this website?