భగవద్గీత – 33
రజోగుణము అంటే dynamic, active అని అర్ధం చేసుకోవచ్చు! తమోగుణము అంటే inertia అంటే జడత్వము, చీకటి సత్త్వగుణము అంటే poise, లేక harmony ఈ మూడూ… పదార్దానికి అంటే జడ ప్రకృతికి లేదా అపరా అని చెప్పబడే ప్రకృతికి ఉన్న లక్షణాలే కదా! మరి వీటికన్న వేరైన ప్రకృతిని ‘‘పరా’’ అని చెప్పుకున్నాం కదా!
అది శుద్దచైతన్యం కదా!
ఆ చైతన్యమే పరమాత్మ!
Also read: జ్ఞాని పరమాత్మకు మిక్కిలి ఇష్టుడు
Consciousness… పంతంజలి మహర్షి ‘‘ప్రజ్ఞానమ్ బ్రహ్మ’’ అని చెపుతారు. అంటే చైతన్యమే బ్రహ్మము అని కదా. అప్పుడు బ్రహ్మము త్రిగుణాలకు అతీతమయినది అని కదా. అందుకే పరమాత్మ అంటున్నారు…
॥యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే
మత్త ఏవేతి తాన్ విద్ది న తవహం తేషు తే మయి॥
సాత్విక, రాజస, తామస భావములన్నీ నా నుండే కలుగుతున్నవి, కానీ యదార్ధముగా వాటిలో నేను గానీ, నాలో అవిగానీ లేవు…
Also read: జీవరూప పరాప్రకృతి
అనగా నేను ‘‘త్రిగుణాతీతుడను’’ త్రిగుణాత్మకమయిన ఈ సృష్టి త్రిగుణాతీతుడయిన నన్ను తెలుసుకోలేదు. ఈ త్రిగుణాలకు అతీతమయిన స్థితే మోక్ష స్థితి.
“యా దేవిమ్ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా“ అని ఆ లలితా పరమేశ్వరి అన్ని ప్రాణులలోను తల్లి రూపంలో ఉన్నది అనికదా అర్ధం?
తల్లి అంటే ‘‘స్త్రీ’’ స, త, ర అక్షరాలతో ఏర్పడిన పదము. సత్వ, తమో, రజో గుణాలను సూచిస్తుందా ఈ పదము అని అనిపించింది!
ఆ త్రిగుణాలను సమన్వయ పరచగలిగిన మహోన్నతమైన బ్రహ్మ సృష్టియేనా ‘‘స్త్రీ ’’ అంటే.
Also read: యోగి ఉత్తమోత్తముడు