Sunday, December 22, 2024

తప్పుడు రేప్ కేసు పెట్టిన అమ్మాయి 15 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం!

  • కొన్నేళ్లు విచారణ ఎదుర్కొన్న అబ్బాయి
  • అమ్మాయికి పుట్టిన శిశువుకి తండ్రి ఆ యువకుడు కాదని తేలిన వైనం
  • పరిహారం చెల్లించాలని యువకుడు కేసు
  • అతడికి అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు

ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి కుదిరింది. అయితే, ఇరు కుటంబాల మధ్య విభేదాలు రావడంతో ఆ అమ్మాయిని తమ అబ్బాయి పెళ్లి చేసుకోడని ఆ యువకుడి కుటుంబం వారు చెప్పారు. దీంతో ఆ అబ్బాయిపై అమ్మాయి కేసు పెట్టింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తాను తల్లినయ్యానని చెప్పింది. దీంతో ఆ యువకుడు కొన్నేళ్లుగా విచారణ ఎదుర్కొన్నాడు.

అయితే, దీనిపై పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం ఆ అమ్మాయికి పుట్టిన శిశువుకి తండ్రి ఆ యువకుడు కాదని తేల్చింది. ఆ యువకుడిని అమ్మాయి కుటుంబం రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడుకు చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి.

వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సంతోష్‌తో ఆ యువతి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాల తలెత్తాయి. సంతోష్ కుటుంబం వేరే చోటుకి వెళ్లిపోయి అక్కడే నివసిస్తోంది. ఆ యువతి గర్బం దాల్చడంతో ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డకు సంతోష్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పారు.

అయితే, తనకేమీ తెలియదని, ఆమెతో తాను ఎన్నడూ సన్నిహితంగా లేనని సంతోష్ తెలిపాడు. అయినప్పటికీ యువతి తల్లిదండ్రులు అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. దీంతో  2009 నవంబరులో అరెస్టయిన సంతోష్ 95 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నాడు. 2010 ఫిబ్రవరి 12న బెయిల్‌పై విడుదలయ్యాడు.

అతడిపై కేసు పెట్టిన యువతి ఓ పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పాపకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా, ఆమె తండ్రి సంతోష్ కాదని తేలింది. 2016, ఫిబ్రవరి 10న న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చి తీర్పు చెప్పింది. అనంతరం తనపై  అన్యాయంగా కేసు పెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఆ యువకుడు పరువు నష్టం దావా వేశారు.

రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కూడా సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles