- శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
- వేదపండితుల ఆశీర్వచనాలు
- ట్విట్టర్ లో అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48 వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేక్ కట్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. పలువురు మంత్రులు, అధికారులు సీఎంకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
టీటీడీ పండితుల ఆశీర్వచనం
అంతకు ముందు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అర్ఛకులు జగనను వేదాశీర్వచనంతో దీవించారు. అనంతరం తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు పలువురు ప్రభుత్వ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శ్రీ కె ధనంజయ్ రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ శ్రీ టి విజయ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం శ్రీ ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీ పినిపె విశ్వరూప్, శ్రీమతి తానేటి వనిత, శ్రీ వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం సీపీఆర్ఓ శ్రీ పూడి శ్రీహరి, దేవినేని అవినాష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి కేట్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు
జగన్ కు అభినందనల వెల్లువ
పుట్టిన రోజు సందర్భంగా సీఎం జగన్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తమిళనాడు సీఎం పళనిస్వామి, ఎంపీ పరిమళ్ నత్వానీ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం లేఖ విడుదల చేసింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అన్నా అని సంబోధిస్తూ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజాసేవలో సుధీర్ఘకాలం కొనసాగాలి అన్నా అంటూ ట్వీట్ చేశారు.
సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వేకి సీఎం శ్రీకారం