విశ్వనాథ విభాగం: మొదటి బహుమతి: లక్ష్మీ వేదుల, రెండవ బహుమతి: ఆర్య సోమయాజుల విమల, మూడవ బహుమతి: జోస్యుల దీక్ష
సినారె విభాగం: అభినవ్ రిషి, లక్ష్మీ తేజస్విని, సాయి జాహ్నవి
రావూరి విభాగం: అద్దెంకి వనిజ, లలిత రాజ్యలక్ష్మి, శౌర్య
భాగవతం శతపద్యరథం విజేతలు: నల్లాన్ చక్రవర్తి సాహిత్ (రూ. 5000), వి.ఎన్.వి. అభినవ్ (రూ. 3000), నేతి శ్రీకర్ (రూ. 2000)
“పద్యానికి పట్టాభిషేకం – ‘తేజోమయం తెలుగు పద్యం’ – శీర్షికన తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్య పోటీలను క్రితం సంవత్సరం ఆగస్టు 2020లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో మరొకసారి ఈ పద్యపఠనపు పోటీలు నిర్వహించాలని తలపెట్టింది శ్రీ వాగ్దేవి కళాపీఠం.
అందులో భాగంగా శ్రీ వాగ్దేవి కళాపీఠం, శ్రీ ప్రణవ పీఠం సంయుక్తంగా శ్రీమద్భాగవతం లోని ‘గజేంద్ర మోక్షణం’ నుండి అంతర్జాతీయ అంతర్జాల పోటీలను ఏప్రిల్ 24 నుండి మే 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా న భూతో అన్న రీతిలో నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో 29 దేశాల నుంచి 29 రాష్ట్రాల నుంచి సుమారు 1400 పై చిలుకు అభ్యర్ధులు పాల్గొన్నారు. కేవలం పద్య పఠనపు పోటీ లే కాకుండా ప్రతి రోజు ప్రశ్నావళి పోటీతో అనేకమందికి భాగవతం పై ఆసక్తిని, అభిరుచిని కల్పించారు. ఈ పోటీలో పాల్గొన్న వారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడం మరో విశేషాంశం.
వారం వారం ప్రవచనం – వారం వారం అంటే ప్రతి వారం గత మూడు నెలల నుంచి అనేక మంది ప్రముఖ ప్రవచనకారులచే గజేంద్రమోక్షణం లోని అనేక అంశాలపై ప్రసంగాలు చెప్పించారు.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
డా. ఎల్. వి.సుబ్రహ్మణ్యం. (మాజీ ముఖ్య కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్), డా.కె. రామచంద్ర మూర్తి (మాజీ ప్రభుత్వ విధాన సలహాదారు), శ్రీ జి.కె. భారవి (ప్రముఖ సినీ రచయిత), డాక్టర్ భువనచంద్ర- (ప్రముఖ సినీ గేయ రచయిత), శ్రీ వి.ఎన్.ఆదిత్య (ప్రముఖ సినీ దర్శకులు), శ్రీమతి మాళవిక (ప్రముఖ సినీ నేపథ్య గాయని). అలాగే సమాపనోత్సవం లో కూడా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు (త్రి భాషా మహా సహస్రావధానులు, ప్రణవ పీఠాధిపతి), శ్రీ కళ్యాణ్ వసంత్ గారు (ప్రముఖ సినీ నేపథ్య గాయకులు), శ్రీ పరవస్తు ఫణి శయన సూరి గారు (పరవస్తు పద్య పీఠం & తెలుగు దండు), డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గారు (మాజీ మంత్రివర్యులు), శ్రీ. డా. ఎన్. జయ ప్రకాష్ నారాయణ గారు (IAS- Rtd.)లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ మరింగంటి కులశేఖరాచార్యులు గారు (ప్రముఖ ప్రవచనకర్త), డా. గన్నమ రాజు గిరిజా మనోహర్ బాబు గారు (ప్రముఖ సాహితీవేత్త), డా. అద్దంకి శ్రీనివాస్ గారు (బాదరాయణ వ్యాస సమ్మాన్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత), శ్రీ కంఠంనేని రవిశంకర్ గారు (మేనేజింగ్ డైరెక్టర్ Telugu one.com), శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు ( ఘట్టి బాల చైతన్యం పద్య పాఠశాల వ్యవస్థాపకులు) శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు (చైర్మెన్ చిమ్మపూడి ఫౌండేషన్).
ఈ పోటీలను శ్రీ వాగ్దేవి కళాపీఠం అధ్యక్షులు శ్రీ వి వి ఎల్ శ్రీనివాస్ మూర్తి గారుఅత్యద్భుతంగా నిర్వహించారు.
ఈ పోటీలలో మరో ప్రత్యేక ఆకర్షణ – ‘భాగవతం – పోతన శత పద్య రథం ‘ – అనే కార్యక్రమం – ఈ పోటీలలో ఆగకుండా భాగవతంలో 100 పద్యాలు పిల్లలు చెప్పడం విశేషం. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించడం మరో విశేషం.
ఈ కార్యక్రమాలను గత నెల రోజుల నుంచి సుమారు 50 వేలకు పైగా వీక్షించడం ద్వారా పద్యానికి పట్టాబిషేకం ప్రతి తెలుగు వారి ఇంటిలోను జరగడం మరో విశేషం.
విజేతల వివరాలు:
శ్రీ విశ్వనాథ విభాగం:
ప్రథమ బహుమతి: శ్రీమతి లక్ష్మి వేదుల (VS _1156 )
ద్వితీయ బహుమతి: శ్రీమతి ఆర్య సోమయాజుల విమల (VS _1107)
తృతీయ బహుమతి: శ్రీమతి జోస్యుల దీక్ష (VS_1113)
శ్రీ సినారె విభాగం:
ప్రథమ బహుమతి: చిరంజీవి అభినవ్ రిషి ( CN_1013)
ద్వితీయ బహుమతి: చి. లక్ష్మీ తేజస్విని (CN_1500)
తృతీయ బహుమతి: నాగ వెంకట శ్రీ సాయి జాహ్నవి (CN_1496)
శ్రీ రావూరి విభాగం:
ప్రథమ బహుమతి: చి. అద్దెంకి వనిజ (RB_1166)
ద్వితీయ బహుమతి: చి. డి. లలిత రాజ్య లక్ష్మీ (RB_1083)
తృతీయ బహుమతి: చి. శౌర్య (RB_1118)
భాగవతం- శత పద్య రథం విజేతలు:
మొదటి బహుమతి: 5000/-
చి. నల్లాన్ చక్రవర్తుల సాహిత్.
ద్వితీయ బహుమతి: 3000/-
చి. V.N.V. అభినవ్ రిషి.
తృతీయ బహుమతి: 2000/-
చి. నేతి శ్రీకర్.
ఇంకా అనేక ప్రోత్సాహక బహుమతులు రూ. 2000,రూ. 1000 చొప్పున అందించారు.
-శ్రీనివాస మూర్తి