తప్పేదేముంది, తప్పేముంది
పుడదాం, మళ్లీ పుడదాం,
మనిషిగానే పుడదాం.
కిందో, మీదో పడి,
ఎదో బ్రతుకుదాం, ఎదోలా బ్రతికేస్తాం,
తెలిసో, తెలికో, తప్పో, ఒప్పో, చేస్తూ, చూస్తూ,
మంచో, చెడో, వరిస్తూ, భరిస్తూ!
తింటాం, తిరుగుదాం,
పని దొరికితే చేస్తాం,
అదీ లేకపోతే
కడుపులో కాళ్ళెట్టుకు పడుకుందాం.
దేవుడున్నాడో, లేడో…
ఎదో ఓ పేరుతో పిలుద్దాం…
అల్లా అనో, రామా అనో, యెహోవా అనో..
ఉంటే వింటాడు…
లేకపోతే…
నా పిలుపుకేం గాలి నొచ్చు కోదు,
నా అరుపుకు భూమి విచ్చుకోదు
నా ప్రార్థన కు సముద్రం ఎండిపోదు.
ప్రయత్నిద్దాం…ఏంటట
మోక్షం రాకపోతే, జెన్నత్ చేరలేకపోతే,
హెవెను దారిలో హేడెస్ అడ్డుకొంటే?
తప్పేదేముంది, తప్పేముంది
పుడదాం, మళ్లీ పుడదాం,
మనిషిగానే పుడదాం.
Also read: నేటి భారతం
Also read: వ్యధ
Also read: అక్షర క్షేత్రం
Also read: చవుడు భూమి
Also read: పాత కథ