• పరస్పర ఆకర్షణలు విషాదమవుతున్నాయా?
• వైవాహిక బంధాల్లో అందాలే శాపమా?
ఏ రోజు పేపర్ చూసినా “భార్య చేతుల్లో భర్త హతం” “ప్రియుడి చేతిలో మోసపోయిన అబల”…”వివాహేతర సంబంధం విషాదాంతం” భార్యను కడదేర్చిన భర్త ఇవే వార్తలు! ఎన్ని మహిళా దినోత్సవాలు నిర్వహించినా ఈ తీరు మారని వార్తల సమాహారం చూస్తుంటే జీవిత “ప్రేమ తత్వాన్ని” జీర్ణించుకున్న వారు తక్కువ అనిపిస్తుంది. అపార్ట్ మెంట్ కల్చర్, కిట్టి పార్టీల్లో ప్రేమ ముసుగులో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. అగర్బ శ్రీమంతుల ఇళ్లల్లో జరిగే ప్రేమ కథలు…తెరమీదకు రావు. కప్పిపుచ్చుకునే కల్చర్ ఒకటైతే దానికి తోడు ‘టెకీట్ ఈజీ’ పాలసీ మరొకటి. అలాంటి వారింట్లో వివాహేతర సంబంధాల్లో హత్యలు – ఆత్మహత్యలు ఉండడం లేదు. ఇక కూలీనాలి చేసుకునే వారిలో వివాహేతర సంబంధాలు ఉంటే చితకబాది కులకట్టుబాట్లలో “సెట్ రైట్” చేసే పెద్దలు ఉంటారు.
మధ్యతరగతి కుటుంబాలలోనే మంటలు
ఎటొచ్చీ మధ్యతరగతి కుటుంబాల్లోనే ఈ సంబంధాలు తుపాన్లు చెలరేగేలా చేస్తున్నాయి. వివాహ బంధాలను విచ్చిన్నం చేస్తున్నాయి. టీనేజ్ లవ్ ల కన్నా విపరీత పోకడలకు పోతున్న ఈ ఆకర్షణ బంధాలు కుటుంబాల్లో చిచ్చు రగిలేలా విచ్చిన్నం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సగటున ఒక కొర్టు పరిధిలో ఇలాంటి పంచాయితీలు వారానికి రెండు చొప్పున వస్తున్నాయని తెలుస్తోంది! ఇక ఇంట్లోనే మగ్గిపోతున్న కేసులు అనేకం. ఈ ఆకర్షణ ప్రేమ కాలేజీ అమ్మాయిల్లో కాదు. 35 నుండి 50 ఏళ్ల వయసు కావడం ఇక్కడ విశేషం. వారే పెద్ద అపశృతికి కారణం అవుతున్నారు. ఇందులో మగవారి పాత్ర ఎక్కువ. గుట్టుగా సంసారం చేస్తున్న మహిళలను మభ్యపెట్టి ఆకర్షణ, ప్రేమ ముసుగులో దింపి అగ్నిసాక్షిగా పెళ్లాడిన మహిళని మోసపుచ్చే మొగరాయుళ్ల జీవితాలు కత్తుల వంతెన మీద నడుస్తున్నాయి.
Also Read: పండంటి కాపురానికి పదహారు సూత్రాలు
ఆకర్షణ బాహ్యసౌందర్యానికి సంబంధించింది
ఆకర్షణ అనేది పరిమాణాత్మక, బాహ్య సౌందర్యం క్రిందికి వస్తుంది. సంపూర్ణమైన ప్రేమ వల్ల కాదు. ఈ ఆకర్షణ వల్ల వర్షపు తుఫానులు, భూకంపాలు, బ్లాక్‌అవుట్‌లు వైవాహిక జీవితాల్లో సంభవిస్తున్నాయి. ఈ “రహస్యమైన ప్రేమ” లో మాధుర్యం ఎంతగా ఉందో మలినం అంతే ఉంది. వ్యతిరేక లింగానికి చెందిన ఈ ప్రేమలను అయస్కాంతత్వం అని పిలవొచ్చు. ఇది ఇష్టం లేకపోయినా, ఇది ఇద్దరినీ మభ్యపెట్టే, వారిని ఆకర్షణకు గురిచేసే ఒక రకమైన శక్తి. ఇది ఆకర్షణ యొక్క ఖచ్చితమైన నిర్వచనానికి దగ్గరగా ఉంటుంది. మంచి పదం లేకపోవడం వల్ల ‘మాగ్నెటిజం’ అని పిలవాలని జపాన్ నవలా రచయిత ఒకరు అన్నారు.
ప్రేమంటే ఏమిటి?
ఇప్పుడు ఆకర్షణకు విరుద్ధంగా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అవును, రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా గందరగోళంగా ఉంటుంది. మీరు తరచుగా ప్రేమ కోసం ఆకర్షణనే పదాన్ని కప్పిపుచ్చవచ్చు. ఆకర్షణ కోసం ప్రేమను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. కానీ మీరు అతనితో/ఆమెతో ప్రేమలో ఉన్నారని దీని అర్థం కాదు. చాలా మంది గొప్ప పురుషులు/స్త్రీలు ఈ సందిగ్ధతకు మూల్యం చెల్లించారు. కొన్నిసార్లు, మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉండవచ్చు. మరియు మీరు మూడవ వ్యక్తి వైపు ఆకర్షితులు కావచ్చు. కానీ ఆత్మ నియంత్రణ ఉండాలి. దాని గురించి మీకు అపరాధ భావన ఉండొద్దు. ఒకరి పట్ల ఆకర్షించబడటం మానవ స్వభావం కాబట్టి అపరాధ భావన అవసరం లేదని అనుకుంటున్నారా? కానీ మీరు ప్రేమికుడికి/ ప్రేయసికి కట్టుబడి ఉన్నప్పుడు వేరొకరితో మీ ఆకర్షణపై చర్య తీసుకున్నప్పుడు వికారమైన పరిణామాలు ఉంటాయన్న విషయాన్ని మరవద్దు. ఒక వ్యక్తి వివాహేతర సంబంధాలు లేదా అక్రమ సంబంధం కలిగి ఉండటానికి దారితీసే అనేక కారణాలలో ఆకర్షణను ఒక ముఖ్య కారకంగా పరిగణించవచ్చు. ఒకవేళ, మీరు కూడా ప్రేమలో ఉన్నారా లేదా ఒకరి పట్ల ఆకర్షితులైతే అర్థం చేసుకునే ఈ “గందరగోళం” లో మీరు కూడా ఉన్నారన్న మాట. ఈ వ్యత్యాసాన్ని చెప్పడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆకర్షణ ఎక్కువగా శారీరకంగా లేదా ఒక కారణం కోసం జరుగుతుంది. ఇందులో డబ్బు, హోదా కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
Also Read: ఆధునిక మహిళ కోరుకుంటోంది హక్కులు కాదు, ఆప్యాయత – ఆదరణ
ఆకర్షణ, వికర్షణలను అర్థం చేసుకోవాలి
ఈ విషయం చుట్టూ చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆకర్షణ ఎక్కువగా శారీరకమైనదని. దానిలో కామం అనే ఒక అంశం ఉందని చాలా మంది నమ్ముతారు. కొన్ని కోరికలు నెరవేరిన తరువాత, ఇంతకు ముందు ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించకపోవచ్చు. అయినప్పటికీ, కొంతమంది విమర్శకులు ఆకర్షణ కేవలం శారీరకంగా ఉండవలసిన అవసరం లేదని నమ్ముతారు. ఒక స్త్రీ గానీ పురుషుడు ఒకరి మేధస్సుకు లేదా వ్యక్తిత్వానికి కూడా ఆకర్షితులవుతారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, మీరు బేషరతుగా ఉండే ప్రేమకు భిన్నంగా ఒక కారణం కోసం ఒక వ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారన్న మాట. అది మీ మనసాక్షిని బట్టి పెరగవచ్చు లేదా తరగవచ్చు. ఒకొక్క సారి వివాహ “బంధం” నుండి కూడా తెగతెంపులు చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక ప్రలోభాలతో పోరాడటానికి 10 ఆచరణాత్మక మార్గాలు ఉంటాయన్న విషయాన్ని మరవద్దు!
నెపం మరొకరిపైన నెట్టడం మొదటి తప్పు
ఎవరైనా ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకున్నప్పుడు వారు చేసే మొదటి పని తప్పు ఒకరిపై నెట్టడం. చాలా మంది తమ జీవిత భాగస్వామిని మోసం చేయడానికి పనికట్టుకొని బయలుదేరరు. ఇదంతా అప్రయత్నంగా, చిన్న స్థాయిలో మొదలవుతుంది. ఇది నిరంతరాయంగా వెళ్ళే ఆలోచనతో మొదలవుతుంది. బహుశా ఫాంటసీగా కూడా పెరుగుతుంది. ఆ ఆలోచనలు ఒక వైఖరిగా పెరుగుతాయి. తరువాత వైఖరి ఒక స్వభావంగా పెరుగుతుంది. ఆ వైఖరి సరిహద్దులను దాటేస్తుంది.
చాలా మంది పురుషులకు/ స్త్రీలకు ఇది DNA ఆకర్షణ. కోరికను తీర్చుకోవడానికి బలమైన స్వభావం ముందే మన మనసులో లోడ్ చేయబడింది, అయినప్పటికీ జీవితం, నైతికత ఆ ప్రవృత్తులను నియంత్రించగలమని మైన్డ్ మరో వైపు హెచ్చరిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎలా ముందడుగు వేయాలి? మన వివాహాలు, సంబంధాలు ఎట్లా నిలుపునకోవాలో తెలుసుకుందాం.
Also Read: మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!
పాటించవలసిన పది సూత్రాలు
1.స్త్రీలను/ పురుషులను ప్రలోభాలకు గురిచేయకండి. పది మంది ముందే మీ భావాలు వ్యక్తం చేయండి. నచ్చిన వారి పట్ల వ్యామోహం వద్దు. పవిత్ర ప్రేమను పంచండి 2. ఒక వేళ వ్యామోహమే అనుకుంటే తరువాత జరిగే పరిణామాలు ఉహించండి. మీ భార్యకు/ భర్తకు తెలిస్తే ఏలా స్పందిస్తారో ఆలోచించండి. 3. అశ్లీలతకు దూరంగా ఉండండి. ఇది అవాస్తవమని, జీవిత భాగస్వామి పట్ల మీరు చేస్తున్న పని తప్పని మనసు హెచ్చరిస్తోందా ఆలోచించండి. 4. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడండి.. ఆ రాతలను, మాటలను మరొకరు చూస్తారన్న విషయాన్ని మరవకండి. నిజమైన ఉద్దేశ్యాలను ప్రస్తావిస్తే మీరు నిజాయితీగా ఉన్నట్టే. 5. లైంగిక ఉద్దేశాలు మనసులోకి రానివ్వకండి. మనం మనుషులమే కాబట్టి అవి వచ్చి నప్పుడు భావోద్రేకాలకు లోను కాకుండా ఆమెను/ ఆయనను కలవద్దు లేదా సోషల్ మీడియా కు దూరంగా ఉండటమే మీ పరిపక్వతకు నిదర్శనం అవుతుంది. 6. స్వచ్ఛమైన రిలేషన్స్ ఉంచండి సంబంధాన్ని కాపాడడానికి కొన్ని సార్లు దాటవేయండి. చేయండి. నిజంగా మీకు మార్గ దర్శనంగా ఉండాలనుకుంటే మీ పవిత్ర స్నేహం చెక్కు చెదరదు. 7. మీ స్నేహితులను తెలివిగా ఎంపిక చేసుకోవాలి. లైంగిక ప్రేరేపణలు చేసే వారు ఉంటారన్న విషయాన్ని మరవకండి. 8. అధిక ప్రమాణాలు పాటించండి. మీరు గొప్ప విద్యావేత్త అన్న విషయాన్ని మరవకండి. ఒక స్త్రీ/ పురుషుడు మిమ్నల్ని వేరే దారిలోకి తీసుకెళ్తున్నప్పుడు ఫ్రెండ్ గా నచ్చ చెప్పండి లేదా హెచ్చరించండి. 9. క్షణికావేశాల్లో చేసే ఒక తప్పిదం జీవితాంతం వేధిస్తుంది. 10. మనసు మాట వినకపోతే దేవునిపై దృష్టి పెట్టండి. సానుకుల దృక్పథం అలవర్చుకోవాలి. మీ జీవిత భాగస్వామి మిమ్నల్ని నమ్ముతున్నారని మరవకండి.