* పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుతున్నారా?
* కాషాయ జెండా కిందికి కమ్యూనిస్టులు
ఎగరెసిన ఎర్ర జెండా! రుద్రాలిక నయనజాలికా, కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి! అన్నాడు శ్రీశ్రీ! కలకత్తా కాళిక కూడా కళ్ళెర్ర జేసి కమ్యూనిస్టు భావజాలాన్ని కదిలించి… సరికొత్త కాళికాదేవీ గా అధికారంలోకి తెచ్చిన మమతా బెనర్జీ ఇప్పుడు ఎంతగా కళ్ళెర్ర జేసిన కూడా అధికార పీఠం ఆమెకు దూరంగా కదులుతోంది. ఇప్పటి నవతరం సరికొత్త ”కాళికావతారాన్ని” కోరుతోంది.
నవభారత నిర్మాణం
నవ భారతంలో కలకత్తా అభ్యుదయ పథంలో కాకుండా అవసాన దశకు చేరుకోవడం సుదీర్ఘ కమ్యూనిస్టుల పాలనే అని రాజకీయ పార్టీలు విమర్శించడం సబబే. కాలం చెల్లిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వల్ల భారతదేశంలోని అగ్రనగరాల కన్నా పాతికేళ్ళ వెనుకబడిపోయిన పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా పాలకుల నిర్లక్ష్యా నికి నిలువెత్తు నిదర్శనంలాగా నిలుస్తుంది! సరికొత్త ‘నవ బెంగాల్” గా ఈ యువతరానికి చూపించే సత్తా మాకే ఉందని మారుతున్న ప్రపంచంలో, మారని బెంగాల్ పార్టీలపై బిజెపి దూకుడుతో, కరుడు గట్టిన “కమ్యూనిస్టులు’ కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు గట్టి పోటీ గానే కాకుండా కమ్యూనిస్టుల కోటలో కాషాయ జెండా ఎగిరే దశలో ఉండడడం సరికొత్త ట్విస్ట్.
Also Read : బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి
ఎదుగుదల లేని కమ్యూనిస్టు పాలన
బెంగాల్ మొదటి ముఖ్యమంత్రి ప్రఫుల్లా చంద్ర ఘోష్ ఆగస్టు 15 , 1947 నుండి బీధాన్ చంద్ర రాయ్, అజోయ్ కుమార్ ముఖర్జీ, సిద్దార్థ శంకర్ రాయ్ పాలన1977 వరకు కొనసాగింది. ఆ ముప్ఫయి ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి తరువాత జ్యోతి బాసు, బుద్ధదేవ్ భట్టచార్య 1977 నుండి 2011 వరకు జరిగిన పాలనలో పెట్టుబడిదారులు కలకత్తా రావడానికి భయపడ్డారు. కార్మికులు పక్షపాతిగా ముద్ర పడడం దీనికి కారణం. 1960,
విద్యుత్ కోతలు, సమస్యలు
1970 మధ్య కాలంలో విద్యుత్ కోతలు, సమ్మెలు, హింసాత్మకమైన మార్కిస్ట్–మావోయిస్ట్ ఉద్యమాలు నక్సలైట్ బృందాలు నగరంలోని ప్రజా నిర్మాణాలు విధ్వంసం చేసిన కారణంగా ఆర్థిక మాంధ్యం తలెత్తింది. 1971 లో బంగ్లాదేశ్ విమోచనోద్యమం నగరంలోకి ప్రవేశించిన శరణార్ధుల ప్రవాహం అనేక నిరుపేదలతో కోల్‌కాతా నగరం నిండిపోయింది. కోల్‌కాతా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర స్థానం అయింది.
Also Read : బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు
పారిశ్రామిక వేత్తలు పరార్
1990 తరువాత నగరం ఆర్థికంగా కోలుకొంటున్న దశలో జ్యోతిబస్ సుదీర్ఘ కాలం తీసుకున్న నిర్ణయాల వల్ల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు…ఒక వైపు చెన్నై, ముంబయ్, ఢిల్లీ నగరాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొంది విదేశీ పెట్టుబడులు తెచ్చుకుంటే, కలకత్తా నగరం ఈస్టిండియా నిర్మించిన శిథిల భవనాలతో వెలవెల బోయింది… 2000 లో దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణల తరువాత నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కొద్దిగా అభివృద్ధి సాధించి ఆర్థికంగా బలపడడం మొదలైంది.
పాలకులలో మార్పు రాలేదు
తూర్పు, ఈశాన్య భారతదేశంలో కోల్‌కాతా ప్రముఖ వాణిజ్య, ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం మారుతున్న ప్రపంచంతో పాలకులు మారకపోవడం. తూర్పు భారతదేశంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఒకే ఒక నగరం కోల్‌కాతా. ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన నగరంగా అగ్రస్థానంలో ఉన్న కోల్‌కాతా తరువాతి కాలంలో కొన్ని దశాబ్ధాల ఆర్థిక పతనం చవిచూసింది. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత కూడా భారీ జనసాంద్రత, వాణిజ్య సంఘాల తీవ్రవాదం కారణంగా ఇది కొనసాగింది. వామపక్షాల పిక్కబలంతో నడుపబడుతున్న సమ్మెలు ఇందుకు ఒక కారణం. 1960 నుండి 1990 చివరి వరకు పలు పరిశ్రమలు మూతపడ్డాయి.
Also Read : 5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష
వాణిజ్యం తరలిపోయింది
వాణిజ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళింది. పెట్టుబడులు, వనరుల కొరత కారణంగా తలెత్తిన ఆర్థిక పరమైన వత్తిడి నగరానికి అవాంఛితమైన ” మరణిస్తున్న నగరం ” పేరును కలకత్తాకు సార్థక నామధేయం అయింది.
కమ్యూనిస్టు పాలనపై విసుగు చెందిన ప్రజలకు టాటా మోటార్స్ నానో ప్రాజెక్ట్ నందిగ్రామ్, సింగూరు ఆశ కిరణంగా కనబడింది. పశ్చిమ బెంగాల్, తూర్పు మిడ్నాపూర్, నందిగ్రామ్‌లో 2007 లో హింసాకాండ జరిగింది, ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్) కోసం భూమిని స్వాధీనం చేసుకునేందుకు పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం విఫలం కావడానికి మమతా బెనర్జీ ప్రధాన కారణంగా నిలిచింది!
కమ్యూనిస్టు పాలనకు చరమగీతం
భూసేకరణ విధానం ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్థితికి దారితీసింది పోలీసు కాల్పుల్లో 14 మంది మరణించారు. తరువాత సింగూర్ లో టాటా ప్రాజెక్ట్ కు ఎదురుతిరిగిన మమత బెంగాల్ ప్రజలకు ఆశ జ్యోతిగా కనబడింది. అదే ఊపుతో కమ్యూనిస్టు పాలన కు చరమగీతం పాడింది…తరువాత సోమనాథ్ చటర్జీ లాంటి ఉద్దండున్ని ఓడించి బెంగాల్ ఫైర్ బ్రాండ్ గా పేరు గడించిన మమత, పదేళ్లు ఏకఛత్రదిపత్యంగా బెంగాల్ ను ఏలుతుంది. పదేళ్ల ఆమె పాలనలో కలకత్తా తో పాటు పశ్చిమ బెంగాల్ కూడా గొప్పగా అభివృద్ధి సాధించిన దాఖలలు లేవు… ఈ దశలో పోయిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 18 సీట్లు గెలుచి మమతకు పెద్ద సవాల్ విసిరింది! ఇప్పుడు ఈ నెల నుండి ఏప్రిల్ వరకు ఎనమిది దఫాలుగా జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తాకిడికి తట్టుకోలేక మొన్నటి నందిగ్రామ్ లో ఆమె గాయపడే వరకు బిజెపి మమతకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది! నిన్న మోడీ బెంగాల్ పర్యటనలో “మీరు తనను తలపై తన్నిన భరిస్తాను, గానీ బెంగాల్ అభివృద్ధి కలకత్తా అభివృద్ధికి తమ పార్టీ ఆధునిక దృక్పథం తో అభివృద్ధి చేయనుందని” ప్రధాని హామీకి బెంగాల్ యువత మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి! కలకత్తా ట్రామ్మ్ రైలు మాదిరిగా బ్రేక్ లు పడుతున్న మమత పాలనకు, కలకత్తా పాత ఇళ్లకు రంగులు వేసే దిశగా ఆమె రాజకీయ ఎత్తుగడను బిజెపి ఎన్నికల ప్రచారంలో ఎద్దేవా చేస్తుంది… అయితే తనకు మరోసారి అవకాశం ఇస్తే సరికొత్త దిశగా పదేళ్ల అనుభవాన్ని జోడించే ప్రజ్ఞా చూపుతాననే మాటలను సొంత పార్టీ నేతలను నమ్మే పరిస్థితి లేకుండా చేసుకుంది. మమత పార్టీ నుండి నమ్మిన ప్రముఖులు బీజేపీ పక్షాన ఒకరొక్కరే చేరిపోతున్నారు! ఈ దశలో ఈ సారి బెంగాల్ ప్రజలు కొత్త పాలన కోరుకునే అవకాశాలు లేకపోలేదు.
Also Read : అధికారం… అహంకారం