కట్టుబాటుకు మరో రూపం చట్టం
మన క్షేమం కోసం బాగు కోసం
మనం ఏర్పాటు చేసుకున్నది
దాన్ని పాటించడం కంటే
ఉల్లంఘించడం ఎక్కువ నేడు.
చట్టాన్ని అమలు చెయ్యని పోలీసులు
దాన్ని చిరకాలం సాగదీసే లాయర్లు
ఒకవైపు చట్టాలు చేస్తూ
మరోవైపు దాన్ని అడ్డుకునే నాయకులు
సామాన్యుడి బతుకును నంజుకుంటున్నారు.
ఓట్లు, కోట్లు సంపాదించడం తప్ప
పాలన ఓనమాలు తెలియని నాయక పులులు
వారితో ఏం చేయించుకోవాలో తెలియని మేకలు
ప్రజలను జాగృతం చెయ్యని మేధావులు
కళ్లు మూసుకున్న ఆధ్యాత్మిక గురువులు
తిలా పాపం తలా పిడికెడు పంచుకుంటున్నారు.
తాగి తందనాలాడమంటాడు ఒకడు
తుపాకీ పట్టమంటాడు మరొకడు
ధ్యానంతో పరవశించ మంటాడు ఇంకొకడు
సగటు జీవి ఆరాటాన్ని
బతుకు పోరాటాన్ని
తేలిక చేసే నాయకుడొకడుంటే
వాడిని దిగలాగే వాళ్ళు పదిమంది
వీరికి విదేశీ భక్తుల కుహనా మేధావుల అండ
చట్టానికి దొరకకుండా చేయడమే వారి కర్మకాండ
అమలవుతుందా మనకు ఎప్పటికైనా నిజమైన చట్ట పాలన.
Also read: సామాజిక స్పృహ
Also read: తెలివి తెల్లారిందా?
Also read: హీరో – జీరో
Also read: మోక్షం
Also read: మలుపు