వోలేటి దివాకర్
‘‘అబద్దాన్ని అందంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేశారు. అందువల్లనే కాపులకు న్యాయం జరగలేదు’’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అభిప్రాయ పడ్డారు. రాజమహేంద్రవరంలో సోమవీర్రాజు మీడియాతో మాట్లాడిన అనంతర బిజెపి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో మాట్లాడారు. వైసీపి ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల రిజర్వేషన్లు కేంద్రం చట్టం చేయాలని ఏ విధంగా చెబుతారని ప్రశ్నించారు. ముస్లింలకు మాత్రం కేంద్రం అవసరంలేదు, కేవలం కాపులకు మాత్రం కేంద్రం కావాలా అంటూ పేర్నినాని వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బిసిల రాజకీయ రిజర్వేషన్లలో ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల బిసిలు ప్రజా ప్రతినిధులు అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారని సోమువీర్రాజు అన్నారు.
బిసిల సమస్యల పై ఏలూరు నిర్వహించినట్లుగానే జోనల్ వారీగా సభలు నిర్వహిస్తా మన్నారు.
Also read: తెలుగుదేశంలో మరో తిరుగుబాటు…. పర్యవసానం ఇదే!
‘‘అబద్దాల ను నిజం చేసేందుకు మన రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముస్లింలకు రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చి కాపులకు మాత్రం కేంద్రం అంటున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కాపులకు అన్నాయం చేసింది కుటుంబ పార్టీలే’’ అని ఆయన ఆరోపించారు
‘‘పాదయాత్రల్లో హామీలు ఇస్తారు. అధికారంలోకి రాగానే హామీలు మరుస్తున్నారు. ఇదే మన రాష్ట్రంలో జరుగుతోంది. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. సమస్యలను పరిష్కరించకుండా జటిలం చేస్తున్నాయి’’ అని కుటుంబ పార్టీలపై సోము వీర్రాజు విరుచుకు పడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్ళిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తామే నిలదీశామన్నారు. గుంటూరులో నిరసన దీక్షలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Also read: ఏడుపు ఎంతో గొప్ప….
బీజేపీ 10వేల కిలోమీటర్ల పాదయాత్ర
అధికారం కోసం కాక సమస్యలు పరిష్కరమే ధ్యేయంగా రాష్ట్రంలో 13వేల గ్రామాల్లో 10వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు సోము వీర్రాజు చెప్పారు. బిసిల సమస్యలపై ఏలూరు నిర్వహించినట్లుగానే జోనల్ వారీగా సభలు నిర్వహిస్తా మన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 44వేల పోలింగ్ బూత్ ల స్ధాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.