జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ముంబై పర్యటన సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కుడా మహరాష్ట్ర కు వెల్లడం ప్రధాన్యత సంతరించుకుంది.అయన్ని కేసీఆర్ ఎందుకు తీసుకువెల్లినట్లు చర్చ అటు సినిమా వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రకాశ్ రాజ్ పలు మార్లు సిఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. దేశంలో కొత్త రాజకీయ విధానం కావాలని కొరుకుంటున్నాట్లు ప్రశాష్ రాజ్ పలు సందర్బల్లో చేప్పారు. దేశంలో కొన్ని రాజకీయాలు మతాన్ని అడ్డం పెట్టుకోని రాజకీయాలు చేస్తూన్నారని అయన అవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితురాలు ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ ను మితవాదులు హత్య తర్వాత దేశంలో హిందూత్వవాదుల వల్ల దేశం ప్రమాధంలో పడుతుందని బహటంగా విమర్శలు చేయ్యడంతో అయనకు బేదిరింపులు సయితం వచ్చాయి. అంతేకాక ప్రకాష్ రాజ్ బిజెపివిధానాలను తీవ్రంగా వ్యతిరేస్తూ ఉండటం,సంఘ్ పారివార్ నుండి తరచూ బెదిరింపులు రావడం తో అటు ప్రభుత్వం ప్రకాశ్ రాజ్ కు భద్రతను కూడ ఇచ్చింది. తాజాగా బిజెపి కాంగ్రేసేతర ఫ్రంట్ కొసం కేసీఆర్ చేస్తూన్నా ప్రయాత్నంలో తన భాగస్వామ్యం అవసరమనే కేసీఆర్ ప్రకాశ్ రాజ్ తన టీంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.