బుద్ధిలేదూ
ఎందుకు నన్ను మాటిమాటికీ అడుగుతావు
కవిత్వం రాయమని
కవిత్వమంటే ఏమనుకున్నావు
కలంపట్టి చేతికి వచ్చింది బరికేయడం కాదు
కోరి నన్ను బాధపెడితే రాదు
అది అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ వర్ణన కాదు
ఓ కవితా హృదయం కవి సమయాల్లో
తన లోలోతుల్లోంచి వెలువరించే ఓ ధార
అందులో మునిగి తేలిన రసహృదయానికి ఇహంలోనే ముక్తి
ఆ ఆనందాన్ని అనుభూతిని ఆస్వాదించలేని మనం
కవితాకన్య చీర అంచు కూడా చూడలేం
అందుకే అంటున్నాను – ఎందుకీ బాధ అని
ఇప్పటికైనా నవ్వు నోరు ముసుకొని నా నోరు మూయించు.
Also read: మేలుకో ఓటరూ!
Also read: అంత్య ఘడియలు
Also read: భూతలస్వర్గం కశ్మీర్
Also read: భావదాస్యం
Also read: చట్టం