Sunday, December 22, 2024

రాముడు ఎందుకు దేముడు?

భగవద్గీత – 37

రాముడు దేవుడు ఎందుకయ్యాడు?

ఎందుకు పూజిస్తున్నాం?

మనలాగే మానవ జన్మెత్తాడు కదా!

ఏమిటి speciality!

పదిహేను సంవత్సరాల ప్రాయంలోనే ఘోరరాక్షసి తాటక ప్రాణాలను

వైతరిణి దాటించాడు.

Also read: భగవంతుడి సంకల్పం నుంచి సృష్టి

శివధనుస్సును అవలీలగా ఎక్కుబెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు.

భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా వారే నిర్వచనం.

ఎప్పటికీ వారే.

అర్ధరూపాయి ఆస్థికోసం కన్నతండ్రిని అడ్డంగా నరికే

అధములున్న ఈ సృష్టిలో… ఇంకాసేపట్లో పట్టాభిషేకము,

చక్రవర్తి కాబోతున్నాడు, అంతలోనే తండ్రి ఆదేశము అడవులకు

పొమ్మనమని. ఏ మాత్రం తొణకలేదు. బెణకలేదు. తండ్రి పట్ల

రవ్వంత ధిక్కారమూలేదు. అడవికి ప్రియసతితో, అనుంగు సోదరుడితో

పయనమయ్యాడు.

Also read: నేను సచ్చిదానంద రూపుడను

తన ప్రియమిత్రుడు నిషాదరాజు గుహుడిని ఆప్యాయంగా

కౌగలించుకొని ఆదరంగా పలకరించి మౌనంగా గంగ దాటాడు.

“అన్నా! నీకన్నా రాజ్యం నాకు ఏపాటిది! నేను నీకు సేవకుడిని“ అని

తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్దించినా,

తండ్రికి అనృతదోషము అంటకూడదని భరతుడి ప్రార్దన

తిరస్కరించాడు. అన్నదమ్ముల అనురాగానికి ఈ నాటికీ ఎవ్వరూ

చేరుకోలేని శిఖరాలు వారు.

భార్య అపహరింపబడ్డ తరువాత అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకు

దహన సంస్కారాలు చేసి పశు పక్ష్యాదులు కూడ మనలాంటి ప్రాణులే

అని లోకానికి సందేశమిచ్చాడు.

Also read: ఒక్క శ్లోకాన్నిఅర్థం చేసుకొని మననం చేసుకుంటే  చాలు!

పోతే పోయిందిలే, ఆడవాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు, నాకేంటి

మహారాజును అని అనుకున్నాడా? ఆవిడ దొరికేంత వరకు ప్రాణంలేని

కట్టెలాగ బ్రతికాడు తప్ప, అన్య స్త్రీలను కన్నెత్తి

చూసికూడా ఎరుగడు.

మనుషులను క్రమ పద్ధతిలో నడిపి విజయాలు చాలామంది యోధులు

సాధించారు. కానీ, చంచల స్వభావులయిన కోతులను ఒక్కతాటిమీదకు

తెచ్చి బలమయిన శత్రువును జయించడానికి ఎంత Organisational skills

కావాలి? ఎంత patience ఉండాలి? ఎంత స్పష్టదృష్టి (clear vison)ఉండాలి?

రావణలంక స్వర్ణలంక. అది వశమయిన తరువాత కూడా అయోధ్యకు

తిరిగి వెళ్ళాడు తప్ప, లంకానగర వైభవం ఆయనను ఏమాత్రం మోహంలో

పడేయలేదు.

బలము, వీర్యము, తేజస్సు, పితృవాక్పాలన, ఏకపత్నీవ్రతుడు,

సోదరప్రేమ, ధర్మవర్తనం, గొప్పనాయకత్వం, స్నేహధర్మం

ఇంతేనా?

ఆయన సర్వభూతమనోహరుడు. ఏదిలేదు ఆయన దగ్గర?

ఒక్కొక్కలక్షణము ఒక్కొక్క ఎవరెస్టు శిఖరమే… ఆయన తరువాతనే

ఎవరయినా.

Also read: జ్ఞాని పరమాత్మకు మిక్కిలి ఇష్టుడు

Take any parameter he is the best… ultimate.

ఏకాలంలో అయినా అత్యుత్తమ మానవుడు ఆయనే.

అత్యుత్తమమైనవన్నీ నేనే అని కదా కృష్ణపరమాత్మ చెప్పినది?

రుద్రులలో… శంకరుడు

వేదాలలో… సామవేదము

పక్షులలో… గరుత్మంతుడు

చెట్లలో… రావిచెట్టు

మృగాలలో… సింహము

శస్త్రధారులలో… .శ్రీ రాముడు

ఈవిధంగా

అంతేనా?

Negative ultimate కూడా ఆయనే వంచకులలో… జూదము కూడా ఆయనే!

(Negative, Positive మనకు! There is nothing like positive or negative… situation makes it.) విభూతియుక్తము, ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము,

శక్తియుక్తము, అయినవి ఏదయినా ఆయనే. ఆయన అంశే!

॥యద్యద్విభూతిమత్‌ సత్త్వం శ్రీ మదూర్జితమేవ వా

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్‌॥

మరి శ్రీ రాముడు ఈ నిర్వచనం ప్రకారం

రామ ‘‘బ్రహ్మమే’’ కదా!

శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

Also read: త్రిగుణాల సమన్వయకర్త స్త్రీ!

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles