రాజకీయనాయకులు తాముచేసిన, సాధించిన, నిర్మించిన గొప్పగొప్ప ప్రాజెక్టులకు గుర్తుగా అక్కడ అంతకుముందు పేరున్న సహజమైన ప్రాంతీయ చిహ్నాల పేర్లు పెట్టుకోవటం సహజం.
ఉదాహరణకు ఒంగోలు ప్రాంతములొ ఒంగోలు గిత్తలు పేరోపొందాయి కాబట్టి ఆగుర్తువచ్చేట్లు పేరుపెట్టుకోవచ్చు.
అప్పటిప్రధాని నెహ్రు గారు ప్రారంభించిన శ్రీశైలం ప్రోజెక్టుగాని, నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గాని, అంతకుముందు బ్రిటీష్ వాళ్ళు నిర్మించిన కృష్ణా బ్యారేజ్ గాని, ధవళేశ్వరం బ్యారేజి గాని వాటిని నిర్మించిన వ్యక్తులపేర్లు ఎందుకు పెట్టుకోలేదు?
ఇప్పటి రాజకీయనాయకుల్లాగా వారి తండ్రుల పేర్లు ఎందుకుపెట్టుకోలేదు? వారికి విలువలు ఉన్నాయి కాబట్టి. ఈ రోజు మనప్రభుత్వాలు ప్రతిదానికి వాళ్ళ వాళ్ల పేర్లుపెట్టుకొని శునకానందం పొందుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి ఖర్చుపెట్టినా కూడా అది ప్రజల డబ్బే.
మరి ప్రజలడబ్బుతో నిర్మించిన వాటికి వారి తండ్రులపేరు ఎలాపెడతారు?
వారి సొంతడబ్బుతో నిర్మించి వాళ్ళతాతపేర , అమ్మమ్మపేరో, లేక మీకు ఇష్టంవచ్చినవారి పేరో పెట్టుకోంచ్చు.
అంతేకాని మాడబ్బుతో నిర్మించి, మా ప్రమేయం లేకుండా మీ అబ్బలపేర్లు పెట్టుకోటానికి మీకెవరు అధికారం ఇచ్చారు? మీ సొంతడబ్బుతో ఏదైనా నిర్మించి మీ అయ్యపేరో, అమ్మపేరో పెట్టుకోండి.
అయినా 30 ఏళ్లక్రితం అప్పటి జాతీయనాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ పెరు పెట్టారు. దాన్ని ఇపుడు పెరు మార్చటం ఎమిటి? మీహయాంలో ఏదన్నా నిర్మించి మీ ఇష్టం వచ్చిన పెరు పెట్టుకున్నా అర్ధం ఉంటుంది.
ఎప్పుడో పెట్టిన పెరు మీ స్వార్థం కోసం మార్చటం మంచిదికాదు. అయినా ప్రజల డబ్బుతో నిర్మించిన వాటికి ఇలా వ్యక్తుల పేర్లు పెట్టేటప్పుడు అందరి సలహాలు తీసుకోవాలి. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో నిర్మించి గళ్ళకమ్మ ప్రాజెక్టుకి దానితో ఏ మాత్రం సంభందంలేని ఓబుళరెడ్డి పెరు ఏమిటి? గళ్ళకమ్మ ప్రాంతములొ నిరాడంబరుడుగా పేరుగాంచిన నాగినేని వెంకయ్య పేరుపెట్టినా అర్ధముంటుంది. అంతేకాని ఏమిసంభందంలేని ఓబులరెడ్డి పెరు తొలగించాలి. ప్రజాధనంతో వారివారి సొంతమనుషుల పేర్లుపెట్టుకుని వెర్రి ఆనందం పొందటం సరికాదు.
ఇలాగే అవకాశం ఇస్తే రేపు రాష్ట్రాన్నికూడా వైస్సార్ రాష్ట్రంగా మారుస్తారేమో! ప్రజలారా బహుపరాక్.
నార్నెవెంకటసుబ్బయ్య