Friday, November 8, 2024

డిమాండ్, సప్లయ్ సూత్రం ఆధారంగా వరిధాన్యం సేకరణకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక రచించాలి

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ” వరి ధాన్యం కొనుగోలు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత” పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన సాదిక్ కార్యదర్శి. , ఉపాధ్యక్షుడు జంగిడి వెంకటేష్ , ట్రెజరర్ వి. సురేష్

సమావేశంలో చేసిన పలు తీర్మానాలు:

  1. డిమాండ్.. సప్లై ఆధారంగా క్రాప్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయాలి.
  2. పంటకు అనుకూలమైన సాయిల్, వాతావరణం, నీటి అవసరాల మేరకు పంటలు మార్పిడి విధానం పాటించాలి.
  3. అడాప్టీవ్ ట్రయల్స్ ద్వారా రైతుల్లో పంటలపై అవగాహన కల్పించాలి. పంటలు మార్పిడి విధానం తీసుకురావాలి.
  4. పంట మార్పిడి విధానానికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి.
  5. వాల్యు ఎడిషన్ అండ్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ స్థాపించాలి.
  6. వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి.
    7వ్యవసాయ ప్రత్యన్మయ విధానాల కోసం ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేతలతో కమిటీ వేయాలి అందరి అభిప్రాయం తీసుకోవాలి.

8 ఈ ఒక్క యాసంగి నైనా కేంద్రం బాయిల్ రైస్ కొనాలి

ప్రొఫెసర్ జగపతిరావు, వ్యవసాయ శాస్త్రవేత్త

  • రైతుల గొంతుక గా ఉంటాం.
    రాజకీయాలకు సంబంధం లేదు.
  • వ్యవసాయ శాస్త్రవేత్త ల సలహాలు.. సూచనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు.
  • రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన పంటల ప్రణాళిక మంచిది కాదని గతంలోనే సీఎం కు చెప్పాను.
  • కాళేశ్వరం ప్రాజెక్టు.. వడ్లు పండించేందుకే కట్టారు..
  • రెండేళ్ల కిందటే తెలంగాణ వ్యవసాయం వరి వైపు వెళ్తుందని. హెచ్చరించాం.
  • వానలు తక్కువగా పడ్డప్పుడు మాత్రమే కాళేశ్వరం ఉపయోగపడుతుంది.
  • తెలంగాణ వ్యవసాయంపై భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి. మంచి పంటల కార్యాచరణ కావాలి.
  • రైతులను ఆట వస్తువులుగా చేయొద్దు.
    వ్యవసాయ.. నీటిపారుదల నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
  • కాళేశ్వరం ప్రాజెక్టు చెరువులు నింపడమే.. డిస్ట్రిబ్యూషన్ సిస్టం లేదు.
  • బోర్లు.. బావుల కింద ఆరుతడి పంటలు పండించొచ్చు.
  • వరి విస్తీర్ణం పెరుగుదల మంచిది కాదు.
  • ఈసారికి బాయిల్ రైస్ కేంద్రం తీసుకోవాలి.
  • వడ్ల కొనుగోలు పై రెండు ప్రభుత్వాలు ముందుకురావాలి.
  • మిల్లర్ల లాభం కోసమే బాయిల్ రైస్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తో మాట్లాడి రా రైస్ పెంపు పై చర్యలు తీసుకోవాలి.
  • రైతులకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం తో చర్యలు తీసుకోవాలి.

రవీంద్ర బాబు , వ్యవసాయ శాస్త్ర వేత్త
దేశంలో 300 మిలియన్ టన్నులు ఉండగా.. వరి 120 మి. ట లుగా ఉంది.
తెలంగాణ లో 50 లక్షల ఎకరాల మాగాణి సాగులో ఉంది..
తెలంగాణ ను సీడ్.. వాటర్.. టెక్నాలజీ బౌల్ గా చూడొచ్చు.. ఇన్ని ఉన్న తెలంగాణ లో ఎక్కడో లోపం ఉంది.

  1. వాటర్ ద్వారా మాగాణి కాదు.. నేల రకాలను బట్టి ఉంటుంది.
  2. సాయిల్ అనాలసిస్ ద్వారా ఇరిగేషన్.. రేయిన్ ఫాల్ బట్టి… వ్యవసాయ శాస్త్రవేత్త లతో సలహాలతో పంటల విధానం ఉండాలి.
    డిమాండ్.. సప్లై ప్లాన్ చేసుకొని.. మిగిలిన ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలి.
  3. ఎంఎస్ గ్రెయిన్ (పార్ బాయిల్) ద్వారా నే వరి పై తేడా రావచ్చు.
  4. క్రాప్ డైవర్సీటీ విధానం ఉండాలి. అమలు చేయలేక పోతున్నారు.
  5. క్రాప్ కాలనీల విధానం ముందుకు తీసుకెళ్లాలి.
  6. అగ్రికల్చర్ స్టేట్ పాలసీ.. కేంద్రానికి సంబంధం లేదు.
  7. వ్యవసాయ నిజాలు తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తల సలహాలు.. సూచనలు తీసుకోవాలి.
  8. రాజకీయాలు కాదు.. రైతుల సంక్షేమం కోరుకోవాలి.
  9. వ్యవసాయంతో డిసెంట్రలైజ్ ప్రొక్యూర్ మెంట్ పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలి.
  10. ఎగుమతులపై మార్కెటింగ్ ప్లానింగ్ ఉండాలి.
  11. కో ఆపరేటివ్ సొసైటీ లు సరిగా లేవు.
  12. కార్పోరేట్ వ్యవసాయం వస్తే రైతు కూలీ గా మారిపోతాడు.
  13. రైతుల ఉత్పత్తులకు గోడౌన్ కట్టించాలి.
  14. రాష్ట్ర ప్రభుత్వం అడాప్టివ్ ట్రయల్స్ కండక్ట్ చేయాలి.
  15. గ్రామాలకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలి.

టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్…

  1. అన్ని మంచిగనే ఉన్నయి.. అల్లుడు నోట్లో శని అన్నట్లు ఉంది తెలంగాణ పరిస్థితి.
  2. రాష్ట్రంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు చాలా అనుమానాలు ఉన్నాయి.
  3. వరి.. పత్తి కిందనే చాలా భూమి ఉంది. రైతులకు ఇవే ప్రధాన పంటలు అయినాయి.
  4. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు చెరుకు పంట వేసేందుకు అనుకూలంగా ఉన్నారు. నిజాం షుగర్స్.. తెరవాలంటున్నారు.
  5. పామాయిల్ దిగుమతి చేసి నువ్వులు.. పల్లీ పంటలను సమాధి చేశాయి ప్రభుత్వాలు.
  6. తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎప్పటి నుంచో వేశారు.
  7. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి.
  8. రైతు ఏ రైస్ పెట్టినా కొనాలి.
  9. ఎగుమతి.. దిగుమతులపై కేంద్రం మార్గం చూపాలి.
    చంపారన్ళలో బ్రిటిష్ వాళ్లు నీలి మందు వేయాలని రైతులపై ఒత్తిడి పెట్టిన్నట్టే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.
  10. వరి సాగు పై అనుమానాలు నివృత్తి చేయాలి.
  11. యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాలి‌.
  12. విపరీతమైన దిగుమతులు ఆపాలి.
    వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగమే కేంద్ర కొత్త అగ్రీ చట్టాలు.
  13. దిగుమతి.. ఎగుమతి విధానాలపై రైతు దృష్టి తో కేంద్రం చర్యలు తీసుకోవాలి.
  14. కేంద్రమే ప్రత్యామ్నాయ పంటలపై ముందుకురావాలి.
  15. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.
  16. కోటగోడలు దాటను.. ఎవరితోను మాట్లాడను.. అన్ని నాకే తెలుసు అనే ధోరణి సీఎం కేసీఆర్ వీడాలె.
    రైతులకు అన్యాయం జరిగితే… రాష్ట్ర ప్రభుత్వానిదే పాపం అవుతుంది.

రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి

  • తెలంగాణలో ఏ పంటల కోసం అనేది ప్రాజెక్టులను డిజైన్ చేయలేదు.
  • రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు చూసినా లిఫ్ట్ లే పెడుతున్నారు.
  • కాళేశ్వరం కూడా ఐడీ క్రాప్స్ డిజైన్ చేయలేదు.
  • అగ్రికల్చర్.. ఇరిగేషన్ శాఖల మధ్య సంబంధమే లేదు.
  • వైఎస్ హయాంలో జీవో 33 ప్రకారం స్పింక్లర్ పంటలకు పర్మిషన్ ఇచ్చారు.
    ప్రభుత్వాలు రైతులతో చర్చిచాలి.
  • ఇప్పుడు రైతులు వరి కుప్పల మీదనే ఉరి వేసుకుంటున్నారు.
    తెలంగాణ లో అన్ని పార్టీలు.. సంఘాలు రైతులతో చర్చించాలి.
    రాష్ట్రంలో 30 లక్షల బోర్ల కింద 50 లక్షల ఎకరాల వరి సాగు అవుతుంది.
  • ఏ ప్రాజెక్టును వరికి డిజైన్ చేయలేదు.
    రాష్ట్రంలో సాగర్ కింద తప్పా మిగతా ఎక్కడ లేదు.

అన్వేష్ రెడ్డి కాంగ్రెస్

తెలంగాణ వచ్చాకా కోటి ఎకరాల మాగాణం అని ప్రభుత్వం చెప్పింది.మాగాణం అంటేనే వరి పంట వేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

  • రైతు పండించిన వరి పంటకు బాయిల్.. రా రైస్ లతో సంబంధం లేదు. కొనుగోలు చేశాక ఏం చేసుకోవాలో ప్రభుత్వాల ఇష్టం.
  • ప్రత్యామ్నాయ పంటలు వేస్తే గిట్టుబాటు ధర కల్పించాలి.
    వరి వద్దనమంటే రైతులను నిర్వీర్యం చేయడమే అవుతుంది.
  • వరిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కన్ఫ్యూజన్ లో ఉన్నాయి.
  • రైతులపై స్పష్టమైన వైఖరి తో వెళ్లాలి.

టీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్

  • వరి పై రాజకీయ కోణంలో కాకుండా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • తెలంగాణ ప్రభుత్వం 5 వేల ఎకరాలకు క్లస్టర్ తో అధికారిని నియమించింది.. భవిష్యత్ ఆలోచన తో ముందుకెళ్తోంది.
  • రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది.
  • రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతు సుభిక్షంగా ఉండాలని కృషి చేస్తున్నారు సీఎం కేసీఆర్.
  • కేంద్రం వరిపై అస్పష్టమైన వైఖరి అవలంభిస్తుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది.
  • రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి

  • ఆరుతడి పంటలకే కాళేశ్వరం డిజైన్ చేసింది. మరి కోటి ఎకరాల మాగాణం ఎందుకొచ్చిందో తెలియాలె.
  • యాసంగి వడ్లను కేంద్రం కొంటుంది.
  • రా రైస్ యాసంగిలో కొంటాం.. ఎంత అవసరమో.. ఉత్పత్తిని బట్టి తీసుకుంటాం అని కేంద్రం చెప్పింది.
  • బాయిల్ రైస్ కొనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
  • ప్రత్యామ్నాయ పంటల వైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల ను మళ్లించకుండా నట్టేట ముంచుతుంది.
  • కోటీ 20 లక్షల ఎకరాల యోగ్యమైన భూమి ఉండగా.. వరి..పత్తినే ఎక్కువగా వేశారు.
  • పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ చేసి ఎఫ్ సీఐ కి అమ్ముతుండగా.. అవినీతి జరుగుతోంది.
  • పీడీఎస్ అక్రమ రవాణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదు.
  • బహుళ జాతి విత్తన కంపెనీలతో దేశం బాగుపడదు.
  • పెట్టుబడి ధరలు తగ్గించాలి. ఉత్పత్తి పెంచాలి.. ఇన్ ఫ్లయేషన్ తగ్గించాలి.
  • గతేడాది ఇచ్చినట్లుగానే 45 లక్షల మిలియన్ టన్నుల ప్రకారమే ఈ ఏడాది కూడా కేంద్రం అంతే ధాన్యం తీసుకుంటామంటుంది.
  • కేంద్రం ఇచ్చే పంటల వ్యవసాయ సబ్సిడీ లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలి.
  • ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు రాష్ట్ర ప్రభుత్వం లాభాలు వచ్చేలా చూపించాలి.

బీజేపీ రాష్ట్ర నేత సంగప్ప

  • వరిలో తెలంగాణ 8 స్థానం లో ఉంది.. రాష్ట్రంలో 6 నెలల కిందట నుంచే వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఏర్పడింది.
  • 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ ఇచ్చింది.
  • లెటర్ రాలేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.
  • బాయిల్ రైస్ మాత్రమే కొనమని కేంద్రం చెప్పింది.. మిగతా రైస్ కొనమని చెప్పలేదు.. దీన్ని అడ్డం పెట్టుకొని రైతులు ఆత్మ హత్య‌‌‌ లకు పాల్పడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • 7000 ధ్యానం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు.
  • రాష్ట్రం వానాకాలం వరి పంటను ఎందుకు కొనడం లేదు. రైతులను సీఎం కేసీఆర్ ఎందుకు చంపుతున్నారు.
  • బాయిల్ రైస్.. రా రైస్ మధ్య బియ్యంలో వచ్చే కేజీల తేడా కారణంగానే రైస్ మిల్లర్స్ ఒత్తిడితోనే సీఎం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదు.
  • వడ్లు కొనేందుకు పైసలను కేంద్రమే ఇస్తుంది.
  • ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకెళ్లే ముందు రైతులకు అవగాహన కల్పించాలి.
  • రాష్ట్రంలో 70 శాతం పార్ బాయిల్ రైస్ మిల్లులే ఉన్నాయి.
    కేంద్రం వడ్లు కొనమని చెప్పలేదు. ఇది రైతులు గుర్తించాలె

ఏఐకేఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ చలపతి రావు

  • రైతుల ఆత్మ హత్యలు ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి.
  • కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలతోనే వ్యవసాయ రంగం పై చర్చకు తెచ్చింది.
  • చిన్న కమతాలు రద్దు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ వైఖరితోనే వరి ధాన్యం పై చర్చ జరుగుతోంది.
  • క్రమానుగతంగా పంటల మార్పిడి పై రైతులను ప్రిపేర్ చేయాలి.
  • రైతులను కాంట్రాక్టు వ్యవసాయం వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
  • ప్రతి పంటకు మద్దతు ధర ఇయ్యాలి.

టీడీపీ ప్రతినిధి శేఖర్ రెడ్డి

  • రాష్ట్రంలో రైతులు పండించిన పంటల కొనుగోలు లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.
  • పంటల లెక్కలు తీసి గ్రామసభల్లో చర్చించి అవగాహన కల్పించాలి.
  • గ్రామ యూనిట్ వారీగా వ్యవసాయ లెక్కలు తీసి పంటల మార్పిడి వైపు మళ్లించాలి.
  • ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. కేంద్రం మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలి.
    రైతులకు మద్దతుగా అన్ని పార్టీలు ఉండాలి.
సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles