నేపాలీ వాళ్ళ బండి దగ్గర
స్వైట్టుర్ బేరం చేస్తున్న.
ఓ నగ్న మర్కటం వికవిక నవ్వింది.
సునామి వచ్చి తీరాన్ని ముంచేసింది…
చేపల వాడు తన ఆస్తినంతా ఆనందంగా అర్పించాడు
…వాడి పాత గోచి గుడ్డ!
వర్షం వెలిసింది…
గట్టిగా గడియలు బిగించి
ఇళ్లల్లో ముడుచుకు కూచున్న
మేధావులనబడే మనుషులు.
బయట హడావిడిగా బారులు తీరి
సాగిపోతున్న చీమల దండు.
కార్చిచ్చు ఎలాగో అణిగిపోయింది.
క్షణాలలో, బొరియల లోనుండి
కిచ కిచ లాడుతు తలలు బైటకు పెట్టిన ఎలుకలు.
ఎక్కడినుండో ఓ ప్రశ్న వినిపించింది.
“ఇంతకు ప్రకృతిని
ఎవరు జయించినెట్లో!?”
Also read: పూలవాడు
Also read: రాగాలు
Also read: జీవితం
Also read: సముద్రం
Also read: కాలెండర్