1 ఎవరు అందరికి ఉపయోగపడే రాజధాని కట్టగలరు?
2 ఎవరు పోలవరం పూర్తి చేయగలరు?
3 ఎవరు రాజధానికి పొలాలిచ్చిన రైతులకు న్యాయం చేయగలరు?
4 ఎవరు నీటి ఎద్దడి లేకుండా చేయగలరు?
5 ఎవరు కరెంటు సరైన ధరకు ఇవ్వగలరు?
6 ఎవరు అన్నిటిపై అధిక పన్నులు వేయకుండా ఉంటారు?
7 ఎవరు రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించగలరు?
8 ఎవరు నిరుద్యోగులకు కావలసిన ట్రైనింగ్ ఇప్పించగలరు?
9 ఎవరు ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు ఇవ్వగలరు?
10 ఎవరు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలరు?
11 ఎవరు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దగలరు?
12 ఎవరు అప్పులు తక్కువగా తెచ్చి, ఎక్కువ అభివృద్ధి సాధించగలరు?
13 ఎవరు సంక్షేమ పధకాలను సక్రమంగా అమలు చేయగలరు?
14 ఎవరు తుఫాన్లు, వరదలు వచ్చినపుడు ప్రజలకు అండగా నిలబడగలరు?
15 ఎవరు కక్ష, హింసా రాజకీయాలను కంట్రోలు చేయగలరు?
16 ఎవరు దౌర్జన్యాన్ని, ఆక్రమణలను ఆపగలరు?
17 ఎవరు ఇసుక, ఖనిజ త్రవ్వకాలలో చట్టాలను అమలు చేయగలరు?
18 ఎవరు కొండలను మింగేయకుండా చూడగలరు?
19 ఎవరు గంజాయి, గంధపు చెక్క వ్యాపారాలను అదుపు చేయగలరు?
20 ఎవరు మొండితనం, దౌర్జన్యంతో కాకుండా తెలివిగా మంచి పరిపాలన చేయగలరు?
గమనిక: ఓటు తప్పకుండా వేయండి. లేకపోతే దొంగవోట్లు వేసుకునే దుర్మార్గులు నాయకులు అవుతారు. మీ ఓటుతో గెలిచిన నాయకులకు లక్షల కోట్ల పన్నుల డబ్బు ఖర్చు పెట్టే అధికారం ఇస్తున్నారు. మీ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారో చూచుకోవలసిన బాధ్యత మీదే. కాబట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. కానుకలిచ్చే వాడికి కాదు మంచి చేసేవాడికి ఓటు వేయండి. అందరికీ మంచి జరిగేలా చూడండి.
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
మీలాంటి ఒక సామాన్య వోటరు.