రాజ్యాంగం పీఠిక 2
మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. కొన్ని మౌలికమైన నియమాలతో నిర్మించిన రాజ్యాంగం ఇది. రాజ్యాంగ నియమాలతో పాటు రాజ్యాంగ సంప్రదాయాలు కొన్ని సంవత్సరాలనుంచి వస్తున్నాయి. అంటే సుప్రీం కోర్టులో నలుగురు సీనియర్ న్యాయమూర్తులను గుర్తించి వారిని కొలీజియం అని పిలుస్తున్నారు. నాలుగు సుప్రీం న్యాయస్థాన ధర్మాసనం పీఠాలు నిర్ణయించారు. ఈ పద్ధతిని ఒక సంప్రదాయం అంటారు. అంటే సుప్రీంకోర్టులో నలుగురు సీనియర్ న్యియమూర్తుల నిర్ణయాల ద్వారా ఎవరిని జస్టిస్ గా నియమించాలని న్యాయ ధర్మాసనాలు తీర్పుల ద్వారా అనుకోవడం కోసం కొలీజియం నిర్ణయించారు.
(ఐ ఎ ఎస్ సాధించేందుకు, నా రచనపై రాసుకున్న నోట్స్)
మాజీ న్యాయ శాఖ మంత్రి పి చిదంబర్- మూడు గొప్పవారి వ్యక్తుల గురించి ప్రస్తావించారు. 1. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ (జననం 1951); 2. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (జననం 1962); 3. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (జననం 1971). భారత సంవిధానం పుట్టిన తర్వాత పుట్టిన పెద్దలు వీరు. రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణమేమిటో వివాదానికి తావు లేని విధంగా సుప్రీంకోర్టు పేర్కొంది. సమాఖ్య విధానం, లౌకికవాదం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలు అని నాటి రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. ఇది నియమాల కన్న ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగా స్వతంత్ర న్యాయవ్యవస్థను నిర్మిస్తున్నారు. తద్వారా కొలిజియం వచ్చింది.
ఆ సందర్భంలో కేవలం ఒక్క ప్రధాన మంత్రి, లేదా న్యాయమంత్రి మాత్రమే ఎవరికి సుప్రీంకోర్టు జడ్జిగా నిర్ణయం చేయాలని నిర్ణయించడం న్యాయం కాదని అన్నారు. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు అధికారంలో ‘పెద్దలు’ (ఈ ‘పెద్దలు’ అంటే ముగ్గురు) పరోక్షంగా ఒప్పుకోవడం లేదు. ఆ నిర్ణయాన్నిమరో దారిలో కొట్టేయాలని చూస్తున్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఏకైక రక్షణ న్యాయవ్యవస్థ.
చిదంబర్ చాలా స్పష్టంగా నిలదీస్తున్నారు. ‘‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్‌ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్‌ఖర్ కలగలిపివేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించగలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదని, జాతీయ న్యాయనియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదని అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయ శాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఈ విధంగా అంటున్నారు: న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామనుకోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను: జమ్మూ–కశ్మీర్‌లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి, పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా?; వాక్ స్వాతంత్ర్యాన్ని, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛను, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా?; స్త్రీ పురుషులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించే, స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకుతీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయకుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని నిలదీస్తున్నారు.
ప్రధాన మంత్రిగా పివి నరసింహారావుగారు చాలా తక్కువ మాట్లాడేవారు. కాని మాట్లాడితే చాలా కచ్చితంగా విషయం చెప్పేవారు. ఇప్పుడు ప్రధాన మంత్రి చాలా బలమైన నాయకుడు. ఆయన ప్రజలతో నేరుగా టీవిలో రేడియోలో, బహిరంగ సభల్లో ప్రకటనల ద్వారా అందుతాయి. ఇతర నాయకులు, ఇతర కీలకమైన మంత్రులు, ఉప రాష్ట్రవతి ప్రకటిస్తున్నారు. వీరికి మంత్రి మండలి, పార్టీ పెద్దలు కలిసి కీలకమైన మార్పులను సూచిస్తున్నారు. ఇవి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేస్తాయి.
సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టులు అనేక పార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి చెప్పారు. అందులో 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఆ సమున్నత తీర్పు మన దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను కాపాడడం మన బాధ్యత. అయినా ఆ స్వరూపాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికి అర్థమేమిటి? అదేమంటే నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాకుండా ఒక్క ఛీఫ్ సుప్రీంకోర్ట్ జస్టిస్, వారితో ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి నిర్ణయించాలని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. అంటే ఒక్క ముగ్గురు మాత్రం నిర్ణయించిన వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతారు. కొన్ని అనేక దశాబ్దాల తరువాత నాలుగు సందర్భాలలో అనేకానేక ధర్మాసనాలు చర్చించి తేల్చిన మాట కాదని కేవలం ఒక ప్రధాని, మంత్రి తో ఒకవేళ కలిసిపోయిన ఉండేవారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిపోతే ఇంకా ఏం మిగులుతుంది? న్యాయం బతుకుతుందా?
Also read: అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతా? రచయితా?