ఫొటో రైటప్: రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖర సరస్వతి
భగవద్గీత – 39
నా దృష్టికి అందినంతమేరా వెదికా! భగవానుడు పెట్టిన నిబంధనలు పాటిస్తూ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించే యోగిపుంగవులు ఎవరున్నారా అని. ఇప్పుడు మన సమకాలీన సమాజంలో మనకు అందుబాటులోని వారు ఎవరైనా ఉన్నారా అని…
మీకు తెలిస్తే దయచేసి మాతో పంచుకోండి. ఇంద్రియాలు ఆయన వశమై ఉండాలి.
Also read: అణుబాంబు రూపంలో మృత్యువు
అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల మీద యావ ఉండరాదు! సకల భూతముల హితమును కోరాలి. అంటే ఆయన దృష్టిలో కులము, మతము, జాతి, పుట్టుక, దేశము, రంగు, రూపము, ప్రాణి, ఏ భేదభావము ఉండరాదు. సర్వప్రాణులను సమముగా చూసేవాడు అయి ఉండాలి! మనిషయినా, జంతువు అయినా, పురుగయినా, పక్షయినా అన్ని ఒకటే. అన్నింటిలో ఉన్నది ఒకటే అని తెలుసుకొన్నవాడు.
అదెట్లాగ అంటే మనింట్లో ట్యూబ్ లైటు, ఫాను, ఫ్రిజ్, టివి ఇలాంటి వస్తువులన్నీ చూడటానికి వేరు వేరుగా ఉంటాయి కానీ అంతర్గతంగా సంచరించి పని చేయించేది ఒకటే శక్తి కదా!
అదే విద్యుత్ శక్తి!
Also read: రాముడు ఎందుకు దేముడు?
అలాగే సకల ప్రాణులలోని జీవశక్తి అంతా ఒకటే!
ఆయనే అంతర్యామి అని తెలుసుకున్నవాడు!
ఇన్ని qualifications ఉన్న యోగిపుంగవుడిని ఎందుకు వెదకాలి? ఎందుకంటే ఆయనమాత్రమే సచ్చిదానందఘననిరాకార పరబ్రహ్మమును కనుగొనగలడు. కాబట్టి ఒక రమణులు, ఒక రామకృష్ణులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు…మరి ఈ కాలంలో ఎవరు?
Also read: నేను సచ్చిదానంద రూపుడను