గత 14 వారాలుగా మన అందరినీ అలరిస్తున్ బిగ్ బాస్ తుది దశకు చేరుకుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరనే దానిపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా ఎన్టీఆర్, సీజన్ 2 కి హోస్ట్ గా నాని, వ్యవహరించగా సీజన్ 3, సీజన్ 4కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 కి విజేతగా శివబాలాజీ, సీజన్ 2 విజేతగా కౌశిక్, సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ లు 50 లక్షల ప్రైజ్ మనీ గెలుపొందారు. అయితే సీజన్4 విజేతగా ఎవరు ఆ 50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీని సొంతం చేసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బిగ్ బాస్ సీజన్ 4 విషయానికొస్తే టాప్ 5 లో ఉన్న అయిదుగురు కంటెస్టెంట్స్ అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నారు. దీంతో విజేత ఎవరనేది ఊహించడం కష్టమే . ఎవరి పద్దతిలో వారు గెలుపు కోసం పోరాడుతున్నారు. అయితే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ కు గల పాజిటివ్ నెగటివ్ ఏంటో ఇపుడు చూద్దాం.టాప్ 1 లో అఖిల్, టాప్ 2లో సోహెల్, టాప్ 3 లో అభిజిత్, టాప్ 4లో హారిక, టాప్ 5 ఆరియాన కొనసాగుతున్నారు.
టాప్ వన్ లో కొనసాగుతున్న అఖిల్ పాజిటివ్ విషయాలకొస్తే టాస్క్ విషయంలో పోటాపోటీగా ఆడుతూ గెలుపు కోసం చివరి దాకా పట్టుదలతో పోరాడుతాడు. ఇక నెగటివ్స్ విషయానికొస్తే టాస్క్ లో బాగా ఆడినప్పటికీ వ్యక్తిగతంగా షార్ట్ టెంపర్ ఎక్కువ కావడంతో ఇది ప్రతికూలంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొద్దిగా ఓటింగ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ అంటే కేవలం టాస్క్ లు ఆడటం మాత్రమే కాదు. వ్యక్తిగతంగా కూడా నూటికి నూరు శాతం పర్ ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి ఆ షార్ట్ టెంపర్ ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే అఖిల్ కి గెలిచే అవకాశాలున్నాయి.
ఇక రెండో స్థానంలో ఉన్న సోహెల్ టాస్క్ లో నూటికి నూరు శాతం పర్ ఫెక్ట్ గా ఆడతాడు. సోహెల్ నెగటివ్ విషయాలకొస్తే విపరీతమైన కోపం సోహెల్ సొంతం. అయితే ఫ్రెండ్ షిఫ్ కోసం చిన్న చిన్న త్యాగాలు చేస్తాడు. ఇన్ని రోజులు చేసిన త్యాగాలు ఒక ఎత్తు ఇపుడు ఫైనల్ వీక్ కాబట్టి ట్రోఫీ కోసం ఆ రెండు కంట్రోల్ చేసుకుంటే గెలుపు అతనిదే.
ఇక బిగ్ బాస్ లో మూడో స్థానంలో కొనసాగుతున్న అభిజిత్ పాజిటివ్ విషయాలకొస్తే టాస్క్ లో ఎనలైజేషన్ చాలా బాగా చేస్తాడనే పేరుంది. జడ్జిమెంట్ లో పర్ ఫెక్ట్. అందరినీ సమంగా ట్రీట్ చేస్తాడు. నెగటివ్ విషయానికొస్తే టాస్క్ లో 98 శాతం వరకు మాత్రమే ప్రయత్నిస్తాడు. వంద శాతం కనుక ప్రయత్నిస్తే విజేత అని చెప్పొచ్చు.
ఇక నాలుగో స్థానంలో ఉన్న హారిక పాజిటివ్ విషయానికొస్తే టాస్క్ లో అబ్బాయిలతో సమంగా పోరాడుతుంది. నెగటివ్ విషయానికొస్తే కొన్ని విషయాలలో అభి తరపున ఉండి టాస్క్ పరంగా సమన్యాయం చేయదు. అది కొంచెం తగ్గించుకుంటే హారిక గెలిచే అవకాశాలున్నాయి.
కంటెస్టెంట్స్ లో టాప్ 5లో కొనసాగుతున్న అరియానా పాజిటివ్ విషయానికొస్తే టాస్క్ లో చాలా బోల్డ్ గా వ్యవహరిస్తుంది. ముక్కు సూటిగా మాట్లాడటం వల్లనే ఇన్ని రోజులు బిగ్ బాస్ షోలో కొనసాగడానికి కారణంగా చెప్పొచ్చు. ఇక నెగటివ్ విషయానికొస్తే లాస్ట్ వీక్ నుండి ఎమోషనల్ గా వీక్ అయింది. ఇంతకు ముందు వారాలలో ఆడినట్లు ఆడితే ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలుంటాయి.
ఇక చివరగా టాప్ 5 కంటెస్టెంట్స్ కి ఆల్ ద బెస్ట్ చెబుతూ విజేత గా ఎవరు ఆవిర్భవిస్తోరో వేచిచూద్దాం