భగవద్గీత – 18
ఏ పని అయినా ఎందుకు చేయాలో తెలిసే చేస్తున్నామా?
ఈ ప్రశ్న ఎంత మంది మదిలో ఉత్పన్నమయ్యిందో నాకు తెలియదు. కానీ ప్రస్తుత సమాజపు పోకడలు చూస్తుంటే మాత్రం ఎవరికీ ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలిసినట్లు కనిపించడం లేదు.
మనం అసలు అన్నం ఎందుకు తింటున్నాం? బ్రతకడానికి. కానీ మనుషుల పోకడ చూస్తుంటే తినడానికే బ్రతుకుతున్నట్లుగా ఉంది. Obesity (లావు) ఇప్పడొక సమస్య! మనకొచ్చే 99 శాతం ఆరోగ్య సమస్యలు మన ఆహారపు అలవాట్లవల్ల వచ్చినవే!
Also read: కోట్ల కణాల కుప్ప మానవ శరీరం
బట్టలు ఎందుకు కట్టుకోవాలి?
ప్రకృతి ప్రకోపాలనుండి మనలను మనం రక్షించుకోవడానికి, ఎండ, వానలు, చలి వీటినుండి మనకు రక్షణ కావాలి. మనది భూమి మీద వేడి ఎక్కువ ఉండే ప్రదేశం.
మరి మన దుస్తులు చూడండి!
శరీరం మొత్తాన్నీ బిగుతుగా కప్పేసే ప్యాంటు, షర్టు. కుర్రాళ్ళయితే జీనుప్యాంటులు మరల అవి సూర్యకాంతిని శోషణం చేసుకునే ముదురు రంగులు!
Also read: కర్తను తానే అంటాడు భగవంతుడు
శరీరంలో రోగం పుట్టక ఏంచేస్తుంది?
కొంతకాలం క్రితం వరకు మనవారు తెల్ల తుండుగుడ్డలు బాగా పొడవుగా ఉన్నవి తలపాగా చుట్టుకొని బయటకు ఎండలోకి వచ్చేవారు, గాలాడే పంచె, వదులు లాల్చీ వేసుకొని హాయిగా పనిచూసుకుని ఏ విధమయిన ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళేవారు. ఇప్పటికీ మొరటు, పల్లెటూరు బైతులు అవే వేసుకుంటున్నారు లెండి!
టీవీలో మన మిత్రులు, వారు వేసుకున్న దుస్తులు చూస్తుంటే ఒక్కొక్కసారి కోపం బాధ కలుగుతాయి. డ్రెస్ కోడు పేరుతో ఆధునికత ముసుగులో కొందరు మండువేసవిలో కూడా కోటు, టై కట్టుకొని తిరుగుతుంటారు. వాటివలన లోపల ఉడికిపోతూ ఉంటుంది ఆ అవస్థ చెప్పతరమా!
వీరా మన ప్రజలకు మార్గదర్శనం చేసేది?
నాగరీకం బలిసి ఎవడినో అనుకరించడం నేర్చుకున్న తరువాత చాలావరకు మన వాతావరణానికి అనుగుణంగా ఎలా బ్రతకాలి అన్న విషయంలో ఉన్న జ్ఞానం అంతా నశించి పోయింది. మనం ఇళ్ళు కట్టుకుంటున్నాం అనే కంటే రాతి గుహల్లో బ్రతుకుతున్నాం అనడం కరెక్ట్ …
ఎందుకు?
ఇల్లు దేనితో కడుతున్నాము? సిమెంటు (సున్నంరాయి), ఇసుక, ఇటుక. మరి శ్లాబు దేనితో వేస్తున్నాము? ఇనుము (వేడిని గ్రహిస్తుంది), కంకరరాయి (త్వరగా వేడెక్కుతుంది), సిమెంటు (సున్నపురాయి) ఎంత ఎత్తులో శ్లాబుంటుంది? 10, లేక 11 అడుగులు వేడిని బాగా గ్రహించే వస్తువులతో అతి తక్కవ ఎత్తులో శ్లాబువేసుకొని, వాస్తుపేరుతో ఇంట్లో చెట్లుకొట్టేసి అగ్నిగుండం (infernal den) లాంటి ఇల్లు కట్టుకొని, ఆ వేడి పోవడానికి ఏసీ మిషన్లు పెట్టి బయట వాతావరణంలోకి క్లోరోఫ్లోరోకార్బనులు విడుదల చేసి Global Warmingకి నేను సైతం అన్నట్లుగా కారణమయ్యి అబ్బ వేడిగా ఉంటున్నదని ప్రకృతి ని నిందించడం ఎంతవరకు సబబు?
Also read: ధర్మం గాడితప్పినప్పుడు పరమాత్ముడి జోక్యం
ఇక పొద్దున్న లేచిన దగ్గరనుండి T.V. లలో కోక్, పెప్సి కూల్డ్రింక్ ప్రకటనలే. అదేదో Thunder కూడానట. అవి తాగితే ఎముకలు గుల్లబారి పోతాయి. వాటిలో ఉండే “Phosphoric Acid” balance చేయటానికి మన శరీరం, మన ఎముకలలోని కాల్షియమ్ వాడుకుంటుంది. అందువల్ల శరీరంలోని కాల్షియమ్ నిలువలు తగ్గి ఎముకలు బలహీనపడతాయి. కీళ్ళనొప్పులు, మోకాలి చిప్ప మార్పిడి ఒకదాని తరువాత మరొకటి.
ఇలా చెప్పకుంటూ మన అజ్ఞాన విశ్వరూపం ఎంతగా విస్తరించిందో మనకు అంతుపట్టదు. ఎందుకు చేస్తున్నామో, ఏమి చేస్తున్నామో? తెలిసి చేసేవాడే పండితుడట. పరమాత్మ చెపుతున్నాడు!
యస్యసర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః
‘‘జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః’’
ఎవని కర్మలు కామ సంకల్పములు కావో, ఎవని కర్మలు జ్ఞానమనే అగ్నిలో కాల్చబడినవో అతడు పండితుడనబడును.
Also read: ‘అమిద్గల’ మాయాజాలం