Tuesday, January 28, 2025

వైసిపిలో టిడిపి కోవర్టులెవరు?!

వోలేటి దివాకర్

 అధికార వై ఎస్సార్ సిపిలో తెలుగుదేశం పార్టీ కోవర్టులు ఉన్నారట . ఈ విషయాన్ని స్వయంగా ఆపార్టీ ప్రజాప్రతినిధులే చెప్పుకుని , దెప్పుకుంటున్నారు . పార్టీలో టిడిపి కోవర్టులను ప్రోత్సహిస్తున్నారని ఇద్దరు ప్రజాప్రతినిధులు పరస్పరం వాదులాడుకోవడం … అదీ పార్టీ జిల్లా ఇన్చార్జి , టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి సమక్షంలో జరగడం అధికార పార్టీలోని ఆధిపత్యపోరును పతాకస్థాయికి చేర్చింది . గతంలో కూడా ఇద్దరి మధ్య పలుసార్లు వాగ్వివాదాలు జరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి . ప్రజాస్వామ్యపార్టీలో అంతర్గత విభేదాలు సహజమే . అయితే ఇవి వీధిన పడినపుడే పార్టీలకు ఇబ్బందిగా .

మారుతుంది . అయితే పార్టీని అంటి పెట్టుకుని ఉన్న సామాన్య కార్యకర్తలకు నిజమైన కార్యకర్తలెవరో … కోవర్టులెవరో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు .

గత ఎన్నికల ముందు వరకు ఎంపి భరత్ రామ్ సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు . ఒకదశలో గోరంట్ల కుడిభుజంగా వ్యవహరించారు . ఆయనకు గోరంట్లతో ఏమీ విభేదాలు లేవు . అనూహ్యంగా వైసిపి ఎంపి టిక్కెట్లు దక్కడం …. గెలవడం … చీఫ్ విప్ పదవి దక్కడంతో పార్టీలో పట్టుకోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు . ఈనేపథ్యంలో ఎంపి తన వెంట తిరిగే టిడిపి కోవర్థులను ప్రోత్సహిస్తున్నారన్నది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న జక్కంపూడి రాజా వర్గీయుల ఆరోపణ . ఏది ఏమైనా పార్టీలోని టిడిపి కోవర్టులు ఎవరో ఇరువురు నాయకులకు తెలిసినపుడు పేర్లు బయటపెట్టి , అలాంటి వారిని ఏరివేస్తే నష్టమేంటన్నది కార్యకర్తల సూచన .

రింగురోడ్డు కలరింగా ?

రాజమహేంద్రవరం , రూరల్ , రాజానగరం నియోజకవర్గాల పరిధిలో రింగురోడ్డు నిర్మాణానికి , ఉభయ గోదావరి జిల్లాల్లో ఐదుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంపి మార్గాని భరత్ రామ్ ప్రకటించారు . ఈఅంశం కూడా ఇరువర్గాల మధ్య వివాదాస్పదమవుతోంది . ప్రచారం కోసమే రింగురోడ్డు కలరింగు ఇస్తున్నారని , కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఫ్లైఓవర్లకు మాత్రమే టెండర్లు ఆహ్వానించిందని , అందులో రింగురోడ్డు ప్రస్తావనే లేదని పార్టీలోని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు .

సుబ్బారెడ్డి చేతులెత్తే శారా?

దాదాపు రూ . 125 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వైవీ సుబ్బారెడ్డి , జిల్లాలోని మంత్రులు , ఎమ్మెల్యేలు రాజమహేంద్రవరం వచ్చారు . అభివృద్ధి కార్యక్రమాల అనంతరం రానున్న జిల్లాలోని పార్టీ పరిస్థితి , నగరపాలక సంస్థ . ఎన్నికలపై జిల్లాలోని మంత్రులు , ఎమ్మెల్యేలతో సుబ్బారెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు . ఈసమావేశానికి చాలా రోజుల తరువాత కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ హాజరుకావడం విశేషంగా చెప్పుకోవచ్చు . ఈ సమావేశంలో ఎన్నికలు ఎవరి నాయకత్వంలో జరపాలన్న అంశం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది . ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా , ఎంపి మార్గాని భరత్ల మధ్య వాగ్యుద్ధానికి దారితీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి . ఒకే పార్టీలో విరోధంగా ఉంటున్న వారికి సర్దిచెప్పి విభేదాలను పరిష్కరించాల్సిన సుబ్బారెడ్డి , జిల్లాలోని మంత్రులు ఎవరినీ అదుపు చేయలేకపోతున్నారు . పార్టీ కేడర్ అంతా ఏకమై ఒకే కార్యక్రమాన్ని నిర్వహిస్తే హాజరవుతామని స్పష్టంగా చెప్పాల్సిన మంత్రులు ఇద్దరి అహాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు . ఈ విధానం వల్ల ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగేలా చేస్తున్నాయి . రాజా , భరత్ మధ్య విభేదాల పరిష్కారంలో సుబ్బారెడ్డి కూడా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.

Also read: స్వపక్షంలో విపక్షం, గోదావరి తీరంలో.. అధికార పార్టీలో ఆధిపత్యపోరు!

ఇలాగైతే కష్టమే …

పార్టీ అధినేత ఆదేశం మేరకు సీనియర్ ఎమ్మెల్యే అయినా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు . గోరంట్ల లాంటి నాయకుడే పార్టీ అభ్యున్నతి కోసం ఆధిపత్యం కోసం వర్గ విభేదాలకు ముగింపు పలకలేరా ? అన్నది కార్యకర్తల ప్రశ్న . బహుముఖ నాయకులు , నాయకత్వాలతో పార్టీకిప్రశ్న . బహుముఖ నాయకులు , నాయకత్వాలతో పార్టీకి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు . ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైసిపి ఓటమి ఖాయమని భావిస్తున్నారు . కనీసం నగరపాలక సంస్థ ఎన్నికల నాటికి సమిష్టి ఆమోదం పొందిన సమర్థుడైన నగర కోఆర్డినేటర్ను నియమించుకోవడం అధికార పార్టీకి అత్యవ సరంగా కనిపిస్తోంది . ఇది కూడా పార్టీ నాయకత్వానికి ఒక సవాలేనని చెప్పవచ్చు

Also read: ఏమిటి చీప్ గా … ఎపి బిజెపి లిక్కర్ పాలసీ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles