- ఆర్థిక మంత్రులు నిమిత్త మాత్రులు
- సతమతమయ్యేది సామాన్యులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టె బడ్జెట్ గురించి సామాన్యుడికి అసలే పట్టదు…ఆర్థిక నిపుణులు, వ్యాపార వేత్తలు, పత్రికలు, జర్నలిస్టులు మాత్రం బడ్జెట్ కోసం వాటి విశ్లేషణ కోసం ఎన్నో వ్యాసాలు రాస్తారు. ఈ ఏడాది బడ్జెట్ పైన 135 కోట్ల భారతీయులు భవిష్యత్ ఆధార పడి ఉందని అంటారు. పుట్టిన బిడ్డ దేశం చేసే అప్పుల్లో భాగస్వామి అంటే తల్లి దండ్రులు నమ్ముతారా? నమ్మరు.
భారం సగటు భారతీయులపైనే
కానీ ఇది నిజం. మనం మన సంరక్షణకు, తినడానికీ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడటానికీ, పేదరికం నిర్ములనకూ చేసే ఖర్చు సగటు భారతీయుడిపై భారం పడుతుందనే విషయం రిక్షా తొక్కేవాళ్లకు, ఆటో నడిపించేవారికి తెలియదు. వారికి తెలిసిందల్లా పప్పులు, ఉప్పులు, సిగరెట్లు, మందు బాటిళ్ల పై పెరిగిన ధరలపై రాజకీయ నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తిరిగి ఓట్ల పండుగ వచ్చినప్పుడు డబ్బు ప్రలోభాలకు లోనై వారికే ఓట్లు వేసే ఈ ప్రజాస్వామ్య దేశంలో బడ్జెట్ గురించి ఎవరికీ తెలియని లొసుగులు వంద ఉంటాయి.
Also Read : లోక్ సభలో నిర్మలమ్మ చిట్టా పద్దులు
బడ్జెట్ ఒక మిథ్య
వాటిని విశ్లేషించి సామాన్యుడికి చెప్పే ఆర్థిక విశ్లేషకులు పత్రికా ప్రతినిధులు ప్రజా సమూహంలోకి వెళ్లి ఢంకా బజాయించి చెప్పలేరు! టీవీలో అధికార ప్రతిపక్ష నాయకులు ఆర్థిక స్థితి గురించి అరుచు కోవడం చూస్తూ…టీవీ కట్టేసే… మధ్య తరగతి జీవితాల్లో బడ్జెట్ ఒక మిధ్య…ఆర్థిక పరిస్థితి ఒక అర్థం లేని పదార్థం. తిన్నమా… పన్నమా… లేచామా ఇది సగటు భారతీయుడి నిరాశా వాదం! అసలు బడ్జెట్ అంటే ఏమిటో చూద్దాం మనం షేర్ మార్కెట్.. ముఖేష్ అంబానీ, జిందాల్ లు కుడా బుర్ర బద్దలు కొట్టుకోరు! వ్యాపార సామ్రాజ్యం అంతా కలిసి ఉత్పత్తిని అమ్ముకోవడానికి ప్రభుత్వాన్ని ముందే శాసించే బడ్జెట్ అని విమర్శకులు అంటారు.
ఓడేది సామాన్యుడు
రాజకీయ నాయకులకు నయా పైసా లెక్క తెలియదు… ఆర్థిక మంత్రిని ఆదేశించి బడ్జెట్ సూటు కేసుల్లో తమ ప్రయోజనాలు నింపే ఆర్థిక శాస్త్రాన్ని అవపొసనం పట్టిన ఉద్దండులు కలసి సంతకం పెట్టించే ఈ మాయాజూదం లో ఓడేది సామాన్యుడు. గెలిచేది పెట్టుబడిదారు. బడ్జెట్ అనేది నిర్వచించిన కాలానికి ఆర్థిక ప్రణాళిక. ఇది ఏడాదికి ఒక సారి వచ్చే ఆర్థిక పండుగ.
Also Read : క్లిష్ట పరిస్థితుల్లో కీలక బడ్జెట్ :ఆర్థిక మంత్రి
ప్రణాళికాబద్ధమైన వ్యవహారం
ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు పరిమాణాలూ, ఆదాయాలూ, వనరుల పరిమాణాలూ, ఖర్చులూ, ఆస్తులూ, బాధ్యతలూ, నగదు ప్రవాహాలను కూడా కలిగి కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశ పెట్టే కాగితాల సందడి. ఈ సారి కాగితాలు కూడా లేవు. పేపర్ లెస్ బడ్జెట్ ను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత నిర్మలాసీతారామన్ దే. కంపెనీలూ, ప్రభుత్వాలూ, కుటుంబాలూ, ఇతర సంస్థలూ కొలవగల కార్యకలాపాలు లేదా సంఘటనల వ్యూహాత్మక ప్రణాళికలను వ్యక్తీకరించడాన్ని బడ్జెట్ అంటారు.
ఒక బ్రహ్మపదార్థం
బడ్జెట్ అంటే నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేటాయించిన ఆర్థిక మొత్తాల పట్టిక. వాటిని ఎలా కేటాయించాలనే ప్రతిపాదనలతో పాటు ఉద్దేశించిన వ్యయాల సారాంశం. బడ్జెట్ మిగులు, భవిష్యత్ సమయంలో ఉపయోగం కోసం డబ్బును అందించడం లేదా ఖర్చులు ఆదాయాన్ని మించిన లోటును కలిగి ఉండేలా దేశ ఆర్థిక శాస్త్రవేత్తలు దిశానిర్దేశం చేసే సామాన్యునికి అర్థం కానీ ఒక బ్రహ్మ పదార్థం. బడ్జెట్ (పాత ఫ్రెంచ్ పదం పర్స్ అని అర్ధం) అనేది రాబోయే అకౌంటింగ్ కాలానికి లెక్కించబడిన ఆర్థిక ప్రణాళిక.
Also Read : కరోనా బడ్జెట్ మధ్యతరగతిని కనికరిస్తుందా?
సంస్థాగత ప్రణాళిక
మైక్రో ఎకనామిక్స్ లో బడ్జెట్ అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల మధ్య వర్తకం గురించి వివరించడానికి బడ్జెట్ లైన్‌ను ఉపయోగిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, బడ్జెట్ అనేది ద్రవ్య పరంగా పేర్కొన్న సంస్థాగత ప్రణాళిక. ఏటా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఆర్థిక వ్యవహారాల బడ్జెట్ విభాగం ఈ బడ్జెట్‌ను తయారు చేస్తుంది. ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీ కమిటీకి అధిపతి.
సగటు గృహిణి
ప్రస్తుత భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవహారాలు తెలిసిన సగటు గృహిణి. బడ్జెట్‌లో అనుబంధ అదనపు నిధులు ఉన్నాయా, రాజ్యాంగ యంత్రాల వైఫల్యానికి సంబంధించి రాష్ట్రపతి ప్రకటించినప్పుడు, ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి సమంగా బడ్జెట్ పంచాలి. లేదా రాష్ట్ర జనాభా ప్రాతిపాదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ఒత్తిళ్ల కోసం లేదా ఆయా రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నాయి. అటువంటి రాష్ట్ర బడ్జెట్‌ను కేటాయిపులు తయారుచేయడం ఆర్థిక నిపుణుల పని.
Also Read : చైనాతో వేగడం ఎలా?
పాపాలన్నీ ఆర్థికమంత్రినే పీడిస్తాయి
నిర్మలా సీతారామన్ ఒక్క అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకోరు. సవాలక్ష ప్రశ్నలు జవాబులు వాళ్ల దగ్గరే ఉంటాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలు కనుగుణంగా ప్రజా రంజక బడ్జెట్ ఒక గృహిణి కి సాధ్యం కాదు. కానీ ఆమె అధిపతి కాబట్టి పాపాలన్నీ ఆమె తలపై వేసుకొని సంతకం పెట్టాలి… ఆమె సవరణలు లేదా తనకు ఇష్టమైన విధంగా బడ్జెట్ రూపొందిస్తే ప్రభుత్వాలు ఉంటాయా? రొటీన్ వ్యవహారంగా బడ్జెట్ ప్రవేశ పెట్టి చేతులు దులుపుకోవాలి. భారతదేశం యొక్క మొదటి బడ్జెట్ 1860 ఫిబ్రవరి 18 న జేమ్స్ విల్సన్ సమర్పించారు. అప్పటి నుంచి ఇదే తంతు!