నా పేరులో కులం కలిసి ఉంది
కాని అది అందరికి అర్థంకాదు
అందుకే అడుగుతారు
‘మీరేవిట్లు‘ అని
నాకు అర్థం కాలేదు.
మళ్లీ అడిగారు ‘మీరెవరు‘ అని
అదీ నాకు అర్థం కాలేదు.
మీ కులమేంటి అన్నారు
ప్రశ్న అర్థమైంది
జవాబు తెలియలా.
పుట్టింది సుక్షత్రియ కుటుంబంలో
నాన్న పోలిస్ అధికారి
నేను ఎవరితోనూ పోట్లాడలేను
అంత బలం, ధైర్యం లేదు
కాని నిజం చెప్పే ధైర్యముంది
అదిపాటించే స్థైర్యముంది
దానివల్ల ఎదురయ్యే సమస్యలను
ఎదుర్కొనే దమ్ము మెండుగా వుంది.
నేను ఆచార్యుడిని
నాకు తెలిసిన ఙ్ఞానాన్ని
నలుగురికీ పంచుతాను
త్రికరణశుద్ధిగా ఉండాలని
గట్టిగా ప్రయత్నిస్తాను
బ్రహ్మను అనుసరించే
ఆలోచన చేస్తాను
మరి నేను క్షత్రియుడినా
కాక బ్రాహ్మడినా
పుట్టుక, వృత్తి, ప్రవృత్తి
ఏం చూస్తారు మీరు?
Also read: స్వచ్ఛభారత్
Also read: అమ్మ – నాన్న
Also read: తెలుగు
Also read: త్రిలింగ దేశంలో హత్య
Also read: మార్గదర్శి