డార్విన్, అరబిందో
పరిణామం అన్నాడు డార్విన్
సూపర్ మ్యాన్ అన్నాడు బెర్నార్డ్ షా
దివ్య పురుషుడు అన్నాడు అరవిందుడు
ఈ శరీరం ఆ భవ్య జీవనానికి
పనికి రాదంటాడు డాక్టర్ హెగ్డె.
అబద్దం రాజ్యమేలుతోంది
మోసాలు, మానభంగాలు పెరుగుతున్నాయ్
దయ, మమత, క్షమ మరుగున పడ్డాయ్
మానవత్వం మంట కలుస్తోంది
బ్రతుకు దుర్భర మవుతుంది
కలికాలం అంటున్నాడు సామాన్యుడు.
ఇవన్నీ బాహ్య, లౌకిక ప్రపంచ మార్పులు
అంతర్ముఖులైతే అంతా మాయం
మంచి చెడులు సాపేక్ష విలువలే
మార్పులేనిది ఆ ఒక్కటే అంటాడు వేదాంతి.
ఏది నిజం.
Also read: “దొంగ”
Also read: ‘‘శార్వరి”
Also read: “సామరస్యం”
Also read: “ఆర్ధిక ప్రగతి – విద్య”
Also read: “దోపిడి”