నీలి మేఘాలు, పచ్చని పచ్చిక బయళ్లు
గలగల పారే సెలయేళ్ళు
ఝoఝా మారుతం లాంటి జలపాతాలు
పారదర్శక ముసుగేసుకున్న నీలి కొండలు
వెలుతురు జల్లెడ పట్టే అరణ్యాలు
నిత్య వసంతాన్ని తలపించే చిగురాకులు
ఎలా పోయాయి? ఏమైపోయాయ్?
కొండలు పిండి చేశాం
నేలతల్లి పేగులు పెకలించాం
అరణ్యాలు అరుదు చేశాం
రోదసీలోకి రాకెట్లు పంపాం
ఎంతో అభివృద్ధి సాధించాం.
పుడమితల్లికి పురిటి నెప్పులు రాకుండా చేశాం
నేల చాలక ఆకాశం లోకి ఎదుగుతున్నాం
నీరులేక ఉప్పునీటిని శుద్ధి చేసే పనిలో ఉన్నాం
పరమాన్నాలు వదలి పిజ్జాలు తింటున్నాం
పక్కవాడితోకాక చరవాణితో జత కట్టాం
కొండలకు గుండుగీసి మన నెత్తి మీదకు కుంపట్లు తెచ్చుకున్నాం
ఇంకా మనకు మేఘాలు అరణ్యాలు కావాలా
మనమేగా వాటిని మేసేస్తున్నాం.
Also read: అన్వేషి
Also read: కుపిత
Also read: మేలుకో ఓటరూ!
Also read: అంత్య ఘడియలు
Also read: భూతలస్వర్గం కశ్మీర్