భగవద్గీత – 46
What is the purpose of LIfe?
జీవిత పరమార్ధం ఏమిటి? పుట్టినందుకు తినటం, తాగటం, పడుకోవడం మరల మరల అవే పనులు చేయడం ఇంతేనా? ఇంకేమీలేదా?
ఏమీలేదు. హాయిగా తిను, తాగు. ఇష్టం వచ్చినట్లుగా ఆనందించు. Be merry! Be Happy!
జీవితాన్ని మధుశాలగా మార్చివేసేయ్, యవ్వనాన్ని కామోత్సవంతో ఖుషీ చెయ్. నా ఆనందం, నా సుఖం, నా సంపాదన ఇవి మాత్రమే ముఖ్యం. ఎవడేమైతే మనకేం? తోటి మనిషికి ఏమయితే నాకేం? నాకు మాత్రం మనిషి ఉంటే చాలు. ఒక్కసారే పుడతాం, ఒక్కసారే చస్తాం. మధ్యలో అనుభవించకపోతే ఎలా?
Also read: కృష్ణబిలం అనంతం, అనూహ్యం
ఏం చేస్తాం?
ఈ విధమైన వాదనలు ఈనాడు అన్ని వైపుల నుండి మనకు వినిపిస్తున్నాయి. అంటే ‘‘అసురీ శక్తులు విచ్చలవిడిగా రెచ్చిపోయి వీరవిహారంచేస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి’’ అన్నమాట…
తాగిన మత్తులో పసిపాపలా, పండుముదుసలులా, తల్లీ, చెల్లీ, అక్క …ఏ విధమయిన విచక్షణ లేకుండా అత్యాచారాలు చేయడం. ఆ పైన దేశం భగ్గుమనడం, ఉరి తీయాల్సిందే అని కొన్నినాళ్ళు ఆవేశపడి ఆ తరువాత మరచిపోవడం. ఇదే కదా నేటి చరిత్ర?
మనిషి మత్తులో మునిగితే వచ్చేది సంక్షేమమా? కాదు కాదు అది నైతిక క్షామము!
ఇది వాడండి. ఆ రోగం రాకుండా కాపాడుకోండి. మధురానుభూతులు మరింతగా పొందండి అని ఆలోచనలేని మనుషులకు కూడా ఆలోచన రేకెత్తించే ప్రకటనలు. దాని కోసం అందుకు సంబంధించిన పాఠాలు పెట్టి పిల్లలను చైతన్యవంతులు చేయాలట. అంతే కానీ నిగ్రహం పాటించటం ఎలా? నైతిక వర్తనం అంటే ఏమిటి? ఇవి చెప్పవద్దా?
Also read: త్రిగుణాలకు అతీతంగా ఎదగాలి
పరాయి స్త్రీని కన్నతల్లిగా భావించి గౌరవించిన శివాజీ చరిత్రను పాఠ్యాంశాలలోకి ఎక్కించి బోధించరు.
బయటకు వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా తిరిగివస్తుందో రాదో తెలవదు. దినదినగండం నూరేళ్ళాయుష్షుగా బ్రతుకు వెళ్ళదీస్తున్నది సమాజమంతా.
ఇదంతా ఎందువల్ల? ఈ బ్రతుకుకు అర్ధంలేదు అనే వాళ్ళవల్ల. అసురీ శక్తుల విజృంభణం వల్ల. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో పరమాత్మ చెపుతున్నారు!
కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః
దంభము, దురభిమానము, మదము ఈ గుణాలతో మనసునింపుకొని తనివితీరని కోరికలతో పనికిరాని సిద్ధాంతాలు చెపుతూ భ్రష్టాచారాలు ఆచరిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించెదరు!
అంతేనా?
ఏతాం దృష్టిమవష్టభ్యః నష్టాత్మానోల్ప బుద్ధయః అంటే ఈ రకమయిన మిధ్యావాదాలు పాటిస్తూ తమ తమ స్వభావాలే కోల్పోతారట. The lose themselves.
ఇప్పడు చెప్పండి మన మెటుపోతున్నామో?
సమాజం ప్రస్తుతం అసురీ శక్తుల తోటికాదా నిండి ఉన్నది. వాటిని మూలం నుండీ పెకిలించాలి.
ఎలా?..
సంపూర్ణ మద్యనిషేధము, నైతిక వర్తనము గురించిన పాఠాలు పిల్లలకు బోధించాలి… అప్పుడే సమాజము అనే పొలములో కలుపుమొక్కలు పెరగవు. లేకపోతే మన బ్రతుకింతే, మనమింతే.
Also read: సత్వ గుణం గలవాడు యోగ్యుడు