ఫొటో రైటప్: తిరుపతిలో పోలీసు అధికారికి ఫిర్యాదు అందజేస్తున్న పవన్ కల్యాణ్
ఒకప్రక్క నిన్ననే చంద్రుడిమీది రహస్యాలను కనిపెట్టేందుకు చంద్రయాన్- 3 విజయవంతంగా అంతరిక్షంలోకి పంపాము. ఆటవీకం నుండి ఆధునికంలోకి వచ్చామని విర్రవీగుతున్నాము. ప్రజాప్రతినిధులు అందరూ కుల మత ప్రాంత రహితంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేశారు. ఆచరణలో అందుకుభిన్నంగా ఈరొజు ప్రజాప్రతినిధులు ప్రజలను రెచ్చగొడుతున్నారు.
మొన్న కాళహస్తిలో జనసేన పార్టీవారు, తమనాయకుడు పవన్ కళ్యాణ్ ను ఎవరో ఏదో అన్నారని ధర్నా కార్యక్రమం చేస్తుంటే, జనసేన కార్యకర్తను సీఐ యాదవ్ అనే పొలీస్ అధికారి బహిరంగంగా కొట్టటం జరిగింది .
అలా కొట్టడం సరిఐనదికాదు.
కేసుపెట్టుకోవాలి. అరెస్టు చేసుకోవాలి. అంతేకానీ ఒక పొలీసు అధికారి అలా కొట్టకూడదు.
ఆ అధికారి మీద ఫిర్యాదు చేసేందుకు ఈరొజు పవణ్ కళ్యాణ్ తిరుపతి వస్తుంటే , కాళహస్తిలో కొందరు కులపిచ్చిగాళ్ళు మా యాదవ్ మీద ఫిర్యాదు చేస్తే ఉరుకోము అని గోలచేస్తున్నారు. ఎటుపోతున్నాము మనం ?
పౌరుణ్ణి బహిరంగంగా కొట్టిన అధికారిమీద ఖచ్చితముగా చర్యలు తీసుకోవాలసిందే. దానికి కులం ఎమిటి? నేరస్తులకు కులమేమిటి? తప్పుచేస్తే శిక్షపడుతుంది. లేకపొతే లెదు. అంతేకాని మా కులంవారి మీద పిర్యాదు చేస్తే ఊరుకోము ఎమిటి?
పాపం ఎర్రచందనం దొంగ వీరప్పన్ ను అరెస్టు చేసేటప్పుడు వాళ్ళ కులపోల్లు వచ్చి లేకలేక మాకులంలో ఒక ఎర్రచందనం దొంగ ఏర్పడితే వాడే కావాల్సి వచ్చాడా అంటే ఎలావుంటుంది?
ఒక దొంగబాబా ని అరెస్టు చేస్తే, లేక లేక మా కులంలో ఒక దొంగ బాబా తయారైతే వాడే కావాల్సివచ్చాడా ….మీ కులంలో దొంగ బాబా లేడా అని అన్నట్లుగాఉంది. ఒక ఆర్థిక నేరస్తుణ్ణి అరెస్టు చేస్తే లేకలేక మాకులంలో ఒక ఆర్థిక నెరస్తుడు పుట్టుకొస్తే అయనే కావలసి వచ్చాడా ….మీ కులంలో ఆర్థిక నేరస్తులు లేరా అన్నట్లుగా ఉంది ..కాళహస్తిలో కులోన్మాదుల వ్యవహరం.
ప్రస్తుత ప్రభుత్వములో కుల ఉన్మాదం, మతఉన్మాదం, ప్రాంతీయ ఉన్మాదం పెరిగిపోతుంది. ఇది ఆరోగ్యకరమైన పద్దతికాదు.
కొంతమంది ఇలా కులాన్ని రెచ్చగొడుతున్నారు. ఇలాంటివారిని ఫ్రభుత్వం అణచివేయ్యకపోతే ముందుముందు ఈ రాష్ట్రం మరో బీహారులాగా తయారవుతుంది.
-నార్నెవెంకటసుబ్బయ్య
ఆంధ్రప్రదేశ్ హేతువాదుల సంఘం అధ్యక్షుడు