“Where the Mind is Without Fear”
by Rabindranadh Tagore
తెలుగు అనువాదం: రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
————-
ఎక్కడ భయంతో తల వంచవలసిన అవసరం లేదో
ఎక్కడ ఙ్ఞానానికి హద్దులు లేవో
ఎక్కడ అడ్డుగోడలతో ప్రపంచానికి సరిహద్దులేర్పరిచి
ముక్కలుగా విభజించరో
ఎక్కడ లోలోపలి సత్యం
మాటల రూపంలో బహిర్గత మవుతుందో
ఎక్కడ అలుపెరగని పరిశ్రమతో
పరిపూర్ణత్వానికీ అర్రులు చాస్తారో
ఎక్కడ స్వచ్ఛమైన సెలయేరులా
అనవరతం ప్రవహించే తార్కికశక్తి
దారితప్పి అవగాహనలేని ఆచారాల ఎడారిలో ఇంకిపోదో
ఎక్కడ నీ అనుగ్రహం ఎల్లవేళలా
ఆలోచనలో, ఆచరణలో విశాలత్వాన్ని పెంపొందిస్తూ
ప్రగతి పధాన నడిపిస్తుందో
ఆ స్వేచ్ఛా స్వర్గంలా
నా దేశం జాగృతం కానీ ప్రభూ.
Also read: వర్షం
Also read: రణం
Also read: నాగరికథ
Also read: మహర్షి
Also read: నవ్వుల జల్లు