యోగి రాజ్యంలో
భోగి చెలరేగిపోతుంటాడు.
కట్ట బెట్టిన అధికారంతో
కన్నెర్ర చేసి కాటికి
పంపుతుంటారు !
కళ్ళ ముందే
కన్నెరికాలు జరుగుతుంటాయి !
రక్షకులు
విలువల్ని,వలువలు లేని
దేహాల్ని ఒకే సారి చితి మీద
పేరుస్తారు !
అంతరంగమేది ఉండదు
అంతా బహిరంగమే !
చట్టాలన్ని చిత్తు కాగితాలవుతుంటాయి
అహంకరించిన
అగ్ర కులాలకి
చిన్న కులాలు “చితికి ” పోతుంటాయి
విచారణలు,కమిటీలు
షరా మామూలే
న్యాయం కోసం వేదన
అరణ్య రోదనే !
యత్ర నార్యస్తు లభతే,రమంతే తత్ర రాక్షసాః
Also read: ఫీ ని క్స్
Also read: చర్విత చర్వణం
Also read: నాన్నకి తెలిసినది
Also read: ఇలా మిగిలాం !
Also read: అర్ధ రాత్రి స్వతంత్రం