భగవద్గీత – 15
సృష్టి ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది.
గ్రహాలు ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నాయి.
మనిషి జీవితంలో ఒక క్రమత్వం ఉన్నది.
సంఘజీవనంలో ఒక క్రమత్వము ఉన్నది.
అంటే ఒక rhythm ఉన్నది. ఈ rhythm నే ఋతము లేదా ధర్మము అని అంటాము.
Also read: ‘అమిద్గల’ మాయాజాలం
ఉదా: గణితశాస్త్రపరంగా కొన్ని సంఖ్యలను Fibonassi numbers అని పిలుస్తారు, అంటే ఆ సృష్టి ధర్మాన్ని Fibonassi అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.
ఖగోళ గ్రహాల మధ్య దూరాల నిష్పత్తులు, ప్రొద్దు తిరుగుడు పూలలోని గింజల అమరికల నిష్పత్తి, ప్రతి చెట్టు కాండం మీద మొదటి కొమ్మ నుండి ఆఖరి కొమ్మవరకు, ఆ కాండం నుండి అవి ఉండే కోణాలు…
ఇవన్నీ సరిగ్గా ఒకటే అమరిక! వీటినే fibonassi numbers అని పిలుస్తారు.
Also read: కర్మ బ్రహ్మము నుంచి పుట్టినది
ఇంతేనా cell biologists చెపుతారు ఇలా జీవి శరీరంలోని ప్రతి కణం, మొత్తం జీవి చేసే పనులన్నీ చేస్తుంది. ప్రతి శరీరం కూడా co-operative federal structure of trillions of cells అన్నమాట!
ఇలాగ సృష్టిలోని ప్రతి విషయంలో ఒక rhythm అదేనండీ! ‘‘ఋతమ్’’ ఉన్నది. దీనినే ‘‘ప్రకృతి ధర్మము’’ అని అంటారు!
ఈ ధర్మానికి ఎప్పుడెప్పుడు అయితే హాని జరుగుతుందో అప్పుడప్పుడు పరమాత్మ తనను తాను సృష్టింపచేసుకుంటాడు! అధర్మాన్ని నశింపచేస్తాడు. Nature… act of balancing!
అంటే Act of Balancing అన్నమాట. అలాగే సంఘజీవనంలో శృతి తప్పినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు! ఫ్రెంచి విప్లవము, బోల్షివిక్ విప్లవము, చైనా లాంగ్ మార్చ్, భారత స్వతంత్ర సంగ్రామము, ఇవన్నీ ఈ సూత్రం ప్రకారం జరిగినవే!
వీటితోనే విప్లవాలు ఆగవు. జీవనగమనంలో అధర్మము పెచ్చుమీరినప్పుడు సంఘం తనకు తానే Act of balancing చేసుకుంటూ పోతుంది! దీనినే పరమాత్మ.
॥యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి
భారత అభ్యుథ్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥ అని అన్నారు.
Also read: స్వధర్మ ఆచరణే శరణ్యం